ఆ జిల్లాలో నోయిడా తరహా ఎడ్యుకేషన్ హబ్.. రూ. 600 కోట్లతో
Actor ProfilePolitician

ఆ జిల్లాలో నోయిడా తరహా ఎడ్యుకేషన్ హబ్.. రూ. 600 కోట్లతో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ జిల్లాలో నోయిడా తరహా ఎడ్యుకేషన్ హబ్.. రూ. 600 కోట్లతో, చకచకా సాగుతున్న పనులు
Samayam Telugu28 Jun 2026
ఆ జిల్లాలో నోయిడా తరహా ఎడ్యుకేషన్ హబ్.. రూ. 600 కోట్లతో, చకచకా సాగుతున్న పనులు

తెలంగాణలో విద్యా రంగాన్ని అద్భుతమైన ప్రమాణాలతో, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నగరం ఏ విధంగానైతే విద్యా, పారిశ్రామిక రంగాల్లో శరవేగంగా దూసుకుపోయిందో.. అదే తరహాలో తెలంగాణను కూడా అంతర్జాతీయ విద్యా హబ్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ దార్శనికతకు సజీవ రూపంగా వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండల పరిధిలోని హకీంపేట గ్రామంలో భారీ ఎడ్యుకేషన్‌ హబ్‌ నిర్మాణ పనులు ప్రస్తుతం వేగంగా, చకచకా సాగుతున్నాయి. ఉన్నత విద్యను కేవలం నగరాలకే పరిమితం చేయకుండా.. మారుమూల గ్రామీణ ప్రాంతాల పేద విద్యార్థులకు సైతం చేరువ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ మెగా ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మొత్తం 248 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో వివిధ రకాల విద్యాసంస్థల భవన సముదాయాల నిర్మాణాలు ఊపందుకున్నాయి.ఈ విద్యా కాంప్లెక్స్ పరిధిలో అత్యంత ఆకర్షణీయంగా, అత్యాధునిక వసతులతో రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ భవన నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికే పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులు రాత్రింబగళ్లు శ్రమిస్తున్నారు. దీనితో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను, వైద్య విద్యను బలోపేతం చేసేందుకు మెడికల్, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ విభాగాల భవన నిర్మాణాలను కూడా ఇక్కడే చేపట్టారు. వీటిని 2027 జూన్ నాటికి పూర్తి చేయాలనే గడువును విధించుకోగా.. ఇందుకోసం సర్కారు ప్రాథమికంగా రూ. 19 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది.మరోవైపు, పశుసంపదపై ఆధారపడే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఇక్కడ వెటర్నరీ విభాగానికి సంబంధించి కూడా రూ. 200 కోట్లతో భారీ ఎత్తున విద్యాసంస్థల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఈ పశువైద్య భవనాలను 2028 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటితో పాటు ఉపాధి అవకాశాలను పెంచే ప్రభుత్వ ఇంజినీరింగ్‌