ఆ ఇల్లొక మయసభ
Actor ProfileCelebrity

ఆ ఇల్లొక మయసభ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ ఇల్లొక మయసభ
Andhra Jyothy22 Jun 2026
ఆ ఇల్లొక మయసభ

మెట్లు ఉంటాయి. కానీ వాటిగుండా ఎక్కడికీ వెళ్లలేరు. తలుపులు ఉంటాయి. కానీ తలుపు తీసి, అడుగు వేస్తే పైఅంతస్తులో నుంచి కిందపడిపోతారు. మెట్లు ఉంటాయి. కానీ వాటిగుండా ఎక్కడికీ వెళ్లలేరు. తలుపులు ఉంటాయి. కానీ తలుపు తీసి, అడుగు వేస్తే పైఅంతస్తులో నుంచి కిందపడిపోతారు. పదుల సంఖ్యలో గదులు, వేల కిటికీలు, తలుపులు ఉన్న ఆ సౌధంలో అడుగుకో రహస్యం దాగి ఉంది. అందుకే శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ ఇంటిని ‘మిస్టరీ హౌస్‌’ అని పిలుస్తారు. ఈ భవనంలో అడుగుపెట్టాలంటే ఆసక్తి ఉంటే సరిపోదు. గుండె ధైర్యం కావాలి. ఇంతకీ ఈ మాయా మాన్షన్‌ ఎక్కడుందంటే... వించెస్టర్‌ మిస్టరీ హౌస్‌... క్యాలిఫోర్నియా లోని సాన్‌జోస్‌ ప్రాంతంలో ఉన్న ఓ రహస్య భవనం. బయటి నుంచి చూసే వారికి సాధారణ భవనంలానే కనిపిస్తుంది. కానీ అందులోకి అడుగుపెట్టిన తరువాతే తెలుస్తుంది. అదొక అంతుచిక్కని వింతైన పురాతన మాన్షన్‌ అని. 160కి పైగా గదులు, 40 పడకగదులు, రెండు బేస్‌మెంట్లతో రాజకోటను తలపించేలా ఉంటుంది. సాధారణంగా ఎంత పెద్ద ఇల్లయినా కిటికీలు పదుల సంఖ్యలో ఉంటాయి. కానీ ఈ ఇంటికి మాత్రం ఆశ్చర్యంగా 10 వేల కిటికీలున్నాయి. ఇక తలుపుల సంఖ్య తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. పదులు కాదు, వందలు కాదు... 2 వేల తలుపులున్నాయి. మాన్షన్‌లోని అన్ని తలుపులు లాక్‌ చేసి ఉన్నాయో లేదో చెక్‌ చేసుకుంటూ రావడానికే ఒక రోజు పడుతుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక లోపల వింతలు విశేషాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే అక్కడి ప్రజలు ఈ భవనాన్ని ‘మిస్టరీ హౌస్‌’గా పిలుస్తుంటారు. తలుపు ఉందంటే అక్కడ మరొక గది ఉండి తీరాలి. లేదంటే బయటకు దారైనా ఉండాలి. కానీ ఈ మిస్టరీ హౌస్‌లో మాత్రం అలా ఉండదు. తలుపు తెరిస్తే అక్కడ మీకు గది కనిపించదు. మూసి వున్న తలుపులు తెరిచి, పొరపాటున కాలు బయటికి పెడితే మొదటి అంతస్తు