ఆ అధికారులకు ఏ గతి పట్టిందో అందరికి తెలుసు
Actor ProfilePolitician

ఆ అధికారులకు ఏ గతి పట్టిందో అందరికి తెలుసు

Total News1
Movie Updates0
Sources1
ఆ అధికారులకు ఏ గతి పట్టిందో అందరికి తెలుసు
Telugu Times17 Jun 2026
ఆ అధికారులకు ఏ గతి పట్టిందో అందరికి తెలుసు

నైతిక విలువల్లేని నిఖార్సయిన అవినీతి నేత జగన్‌ రెడ్డి అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. జగన్‌ (Jagan) రాజకీయ ప్రస్థానం అంతా కేవలం ప్రజాధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా సాగింది. జగన్‌తో పనిచేసిన అధికారులు జైలు పాలైతే, చంద్రబాబు (Chandrababu), లోకేశ్‌ (Lokesh)తో పనిచేసిన అధికారులు అందలాలు ఎక్కారు. అవార్డులు, రివార్డులు పొందారు. లోకేశ్‌ పీఏకి గవర్నర్‌ గోల్డ్‌ మెడల్‌ ఇస్తే జగన్‌ పీఏ కేఎన్‌ఆర్‌ వందలాది కోట్ల అవినీతికి పాల్పడి చట్టానికి చిక్కారు. చంద్రబాబు విజన్‌ వల్ల సత్యం రామలింగరాజు (Satyam Ramalinga Raju) లాంటి ఐటీ దిగ్గజాలు అమెరికా అధ్యక్షుడి పక్కన కూర్చునే స్థాయికి ఎదిగారు. అదే రామలింగరాజు ఎప్పుడైతే జగన్‌ కుటుంబంతో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టారో అప్పుడే జైలు పాలయ్యారు అని పేర్కొన్నారు