ఆ 15 నిమిషాల కోసం చేశాడంట!
Actor ProfileActor

ఆ 15 నిమిషాల కోసం చేశాడంట!

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ఆ 15 నిమిషాల కోసం చేశాడంట! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema1 Sept 2026
ఆ 15 నిమిషాల కోసం చేశాడంట! - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

‘నాగబంధం’ (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో, అందులో విజువల్స్ చూసి అంతా షాక్ అయ్యారు. అద్భుతమైన సీజీ వర్క్ తో, యాక్షన్ తో వస్తున్న ఈ సినిమా మెల్లమెల్లగా అంచనాలు పెంచుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాలో హీరోగా నటించిన విరాట్ కర్ణ (Virat Karna) స్పందించాడు. ‘నాగబంధం’ సినిమాలో కేవలం ఆ 15 నిమిషాల ఎపిసోడ్ కోసం ఈ సినిమా ఒప్పుకున్న విషయాన్ని బయటపెట్టాడు. “నాగబంధం ఇంటర్వెల్ ఎక్స్ టార్డినరీగా ఉంటుంది. గ్రాఫిక్స్, ఫైట్స్, గ్రాండియర్ అంతా నెక్ట్స్ లెవెల్ లో ఉంది. నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి అదే మెయిన్ రీజన్. ఇంటర్వెల్ లో ఆ 15 నిమిషాలు ఎడ్జ్ ఆఫ్ ది సీట్ మూమెంట్ ఉంటుంది. ఆ 15 నిమిషాల ఎపిసోడ్ నుంచే సినిమా మరో లెవెల్ కు వెళ్తుంది.” ఇందులో శివుడి పాత్ర పోషించాడు విరాట్ కర్ణ. కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి బలమైన పాత్ర రావడంతో తననుతాను నిరూపించుకోవాలనే కసితో ఈ సినిమా చేశాడంట విరాట్. కొన్ని సందర్భాల్లో దర్శకుడు చెప్పినా వినకుండా, డూప్ లేకుండా నటించాడంట. ఒక దశలో హై-ఫీవర్ లో కూడా సినిమా చేశాడంట. 3వ తేదీన థియేటర్లలోకి వస్తోంది నాగబంధం