
Saikrishna Case : విజయవాడలో సాయికృష్ణ అనే యువకుడి అదృశ్యం ఉదంతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. అసలు సాయికృష్ణ బతికున్నాడా? లేక చనిపోయాడా? అనే విషయాన్ని ప్రభుత్వం తక్షణమే స్పష్టం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన మండిపడ్డారు. బాధితుడి తల్లిని వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా కలిసి పరామర్శించిన తర్వాతే పోలీసు యంత్రాంగంలో కదలిక వచ్చిందని, ఆ తర్వాతే ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారని పేర్ని నాని గుర్తు చేశారు. ఒక యువకుడు కనిపించకుండా పోతే కేసు నమోదు చేయడానికి పోలీసులకు 40 రోజుల సమయం ఎందుకు పట్టిందో సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. Read Also : అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో కలిసి రాగి జావ తాగిన సీఎం చంద్రబాబు ఈ కేసులో విజయవాడ పోలీస్ కమిషనర్ (CP) పాత్రపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్ని నాని ఆరోపించారు. మార్కాపురం నుంచి సాయికృష్ణను టాస్క్‌ఫోర్స్ పోలీసులు తీసుకువచ్చారని, ఆ టాస్క్‌ఫోర్స్ విభాగానికి విజయవాడ సీపీనే అధిపతి అని ఆయన పేర్కొన్నారు. మరి అలాంటప్పుడు ఈ వ్యవహారంలో కీలకమైన పోలీస్ కమిషనర్‌ను ఎందుకు విచారించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ అదృశ్యం వెనుక పెద్దల హస్తం ఉందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయని, పోలీసు ఉన్నతాధికారుల పాత్రపై నిష్పాక్షిక విచారణ జరిపితేనే నిజాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. సాయికృష్ణ ఆచూకీని కనిపెట్టి, ఈ మిస్టరీ వెనుక ఉన్న అసలు దోషులను శిక్షించాలని పేర్ని నాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ నిధులు విడుదల గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన