అసమర్థుల పాలనలో ప్రమాదంలో తెలంగాణ.. ఎస్ఐఆర్ తో తొండి చేసి అధికారంలోకి బీజేపీ
Actor ProfilePolitician

అసమర్థుల పాలనలో ప్రమాదంలో తెలంగాణ.. ఎస్ఐఆర్ తో తొండి చేసి అధికారంలోకి బీజేపీ

Total News1
Movie Updates0
Sources1
అసమర్థుల పాలనలో ప్రమాదంలో తెలంగాణ.. ఎస్ఐఆర్ తో తొండి చేసి అధికారంలోకి బీజేపీ
Namasthe Telangana18 Jun 2026
అసమర్థుల పాలనలో ప్రమాదంలో తెలంగాణ.. ఎస్ఐఆర్ తో తొండి చేసి అధికారంలోకి బీజేపీ

Singireddy Niranjan reddy | గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కన్వెన్షన్ లో నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆ తర్వాత కేసిఆర్ సారథ్యంలో అభివృద్ధి చేసుకున్న తెలంగాణ రాష్ట్రం చంద్రబాబు నాయుడు ప్రియ శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రమాదంలో పడిందని విమర్శించారు. కర్ణాటకలో తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాలే అయినా కృష్ణా నదిలో తెలంగాణ వాటాను సాధించలేకపోతున్నారని విమర్శించారు. కర్ణాటక రాష్ట్రం కృష్ణా నదిపై మూడు కొత్త ప్రాజెక్టులను తాగునీటి ప్రాజెక్టుల పేరా నిర్మిస్తున్న ఎందుకు ప్రశ్నించడం లేదని..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఆంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రయోజనాలకు తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కారు సహకరిస్తుందని విమర్శించారు. నీటి వివాదాలు ఇతర అంశాలను నిర్లక్ష్యం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. కేసిఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తే పాలకులకు వాటిని నడిపే చేతకాక వెనక్కి నెట్టుతున్నారని విమర్శించారు. రేపు రాబోయేది కేసీఆర్, కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ సర్కారే అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలు మరింత పురోభివృద్ధి సాధించడమే కాకుండా కృత్రిమ మేధస్సు ఉద్యోగాలు రాబోతున్నాయని కార్యకర్తల హర్షద్వానాల మధ్య ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో దళిత బిడ్డలు గురుకులాల్లో విద్యను అభ్యసించి యుద్ధ విమానాలకు పైలట్‌గా కావ్య అనే విద్యార్థిని ఎంపిక కావడం బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేద బిడ్డలకు ఉన్నత విద్యను అందించడమే కారణంగా అభివర్ణించారు. ఎస్ఐఆర్ పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ప్రతి ఓటును నమోదు చేసే విధంగా