Badruddin Ajmal MLA Oath : అస్సాం రాజకీయాల్లో సీనియర్ నాయకుడు, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) అధినేత బద్రుద్దీన్ అజ్మల్ సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. బిన్నాకండి నియోజకవర్గం నుంచి నూతనంగా ఎన్నికైన ఆయన.. సోమవారం అస్సాం శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారంతో దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఆయన తిరిగి రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టినట్లు అయింది. స్పీకర్ రంజిత్ కుమార్ దాస్ తన అధికారిక ఛాంబర్‌లో అజ్మల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. గత మే నెలలో జరిగిన ప్రజాప్రతినిధుల ఉమ్మడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అజ్మల్ హాజరు కాలేకపోయారు. ఆ సమయంలో ఆయన పవిత్ర హజ్ యాత్ర నిమిత్తం విదేశాల్లో ఉండటంతో.. తాజాగా సోమవారం ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏఐయూడీఎఫ్ ముఖ్య నాయకులు, మాజీ శాసనసభ్యులు పాల్గొని ఆయనకు అభినందనలు తెలిపారు.పార్లమెంట్ నుంచి మళ్లీ సొంత రాష్ట్ర రాజకీయాల్లోకి..ప్రమాణ స్వీకారం అనంతరం బద్రుద్దీన్ అజ్మల్ అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. జాతీయ రాజకీయాల నుంచి తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి రావడంపై ఆయన స్పష్టతనిచ్చారు. "స్థానిక రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని భావించాను. పార్టీ అంతర్గత చర్చల తర్వాతే నన్ను ఇక్కడి నుంచి పోటీ చేయాలని హైకమాండ్ ఆదేశించింది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఎన్నికల బరిలోకి దిగాను. ఇక్కడి ప్రజలు నాపై పూర్తి నమ్మకంతో భారీ మద్దతునిచ్చి గెలిపించారు" అని అజ్మల్ పేర్కొన్నారు.బీజేపీ సర్కార్‌పై తీవ్ర ఆగ్రహం!ఈ సందర్భంగా దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు, ద్రవ్యోల్బణంపై అజ్మల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రాల్లోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాల వైఖరి వల్ల దేశంలో మైనారిటీ వర్గాల్లో ఒక రకమైన అభద్రతా భావం, భయాందోళనలు నెలకొంటున్నాయని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై మండిపడుతూ.. గ్యాస్, పెట్రోల్, డీజిల్
Actor ProfilePolitician
అస్సాంలో 20 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న ఏఐయూడీఎఫ్ చీఫ్.. అసలెవరీ బద్రుద్దీన్ అజ్మల్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•30 Jun 2026
అస్సాంలో 20 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న ఏఐయూడీఎఫ్ చీఫ్.. అసలెవరీ బద్రుద్దీన్ అజ్మల్