అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక ప్రసంగం.. ఆ మూడు అంశాల
Actor ProfilePolitician

అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక ప్రసంగం.. ఆ మూడు అంశాల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక ప్రసంగం.. ఆ మూడు అంశాలపై ప్రస్తావన.. వాళ్లను వదిలిపెట్టనంటూ వార్నింగ్
10TV Telugu6 Jul 2026
అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక ప్రసంగం.. ఆ మూడు అంశాలపై ప్రస్తావన.. వాళ్లను వదిలిపెట్టనంటూ వార్నింగ్

Tamil Nadu CM Vijay : మాది నటుడి పార్టీ అన్నారు.. నేను సినిమా షూటింగ్ నుంచి నేరుగా సీఎం కుర్చీలో కుర్చున్నానని చాలా మంది ఎగతాళి చేశారు.. అలాంటి విమర్శలు నేను పట్టించుకోను.. చాలా మంది రాజకీయ పార్టీ పెట్టిన తరువాత ప్రజల్లోకి వెళ్తారు.. కానీ, నేను ప్రజల్లోకి వెళ్లిన తరువాత రాజకీయ పార్టీ పెట్టాను.. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ముచేయను.. అదే సమయంలో డీఎంకే అవినీతిని వెలికితీసే విషయంలో వెనక్కు తగ్గను అంటూ తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక ప్రసంగం చేశారు. విజయ్ తన ప్రసంగంలో ప్రధానంగా మూడు అంశాలను ప్రస్తావించారు. హిందీ వివాదం, నీట్, కరూర్ తొక్కిసలాట ఘటన. ఎన్నికల ప్రచార సమయంలో చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటన నన్ను ఎంతో వేదనకు గురిచేసింది. 41మంది ప్రాణాలు కోల్పోయిన ఆ విషాద ఘటనకు సంబంధించిన బాధను మాటల్లో చెప్పలేను అంటూ విజయ్ పేర్కొన్నారు. ఆ బాధ నన్ను ఎప్పటికీ వదలదు. ఆ ఘటన విషయంలోనూ మాపైనే నిందలేశారు. ఇది అత్యంత దారుణం. రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా..? అని సీఎం విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ వివాదంపై విజయ్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. నీట్ విధానం విద్యా వ్యవస్థలో అసమానతలను సృష్టిస్తోందని, దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తమిళనాడులో ద్విభాషా విధానానికే తాము కట్టుబడి ఉన్నట్లు విజయ్ అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. హిందీ భాషను రుద్దేందుకు కేంద్రం చేస్తోన్న ప్రయత్నాలను తాము ఎప్పటికీ అంగీకరించబోమని పేర్కొన్నారు. డీఎంకేపై విజయ్ సంచలన వ్యాఖ్యలు.. సీఎం విజయ్ డీఎంకేను ఉద్దేశిస్తూ అసెంబ్లీ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒకేఒక్క కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వండం తమ రాజకీయ విధానం కాదని విజయ్ అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అవినీతిపై తమ ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని విజయ్ స్పష్టం