
బంగారు గనుల వేట అనగానే దేశంలో ఇప్పటివరకూ కర్నాటకలోని కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) పేరే గుర్తొచ్చేది. కానీ, ఇకపై ఆ రికార్డులను తిరగరాస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగనుంది. ఒకప్పుడు కరవు కేకలతో అల్లాడిన కర్నూలు జిల్లా.. ఇప్పుడు దేశంలోనే ప్రైవేట్ రంగంలోనే అతిపెద్ద గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టుకు ప్రధాన వేదికగా అవతరించింది. కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం పరిధిలోని జొన్నగిరిలో జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ప్రతిష్టాత్మక జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాంట్ విస్తరణలో భాగంగా రెండో యూనిట్‌కు కూడా సీఎం శంకుస్థాపన చేయడం విశేషం.జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు రూ.405 కోట్ల భారీ పెట్టుబడితో ఈ సువర్ణ సామ్రాజ్యాన్ని నెలకొల్పాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఏకంగా 1,500 ఎకరాల భూమిని కేటాయించగా, మొదటి దశలో 600 ఎకరాల్లో తవ్వకాలు జరిపేందుకు అత్యాధునిక ప్రాసెసింగ్ ప్లాంట్లు సిద్ధమయ్యాయి. పసిడి వెలికితీతలో ఈ ప్లాంట్ సంచలనాలు సృష్టించబోతోంది. తొలి ఏడాది 400 కేజీల పసిడి ఉత్పత్తితో ప్రారంభమై.. వచ్చే ఏడాది నాటికి 900 కేజీలు, ఆ తర్వాతి దశలో ఏటా ఏకంగా 2 టన్నుల మేర బంగారాన్ని వెలికితీసేలా ఈ ప్లాంట్ సామర్థ్యాన్ని భారీగా విస్తరించనున్నారు. ఈ ప్లాంట్ నిర్వహణకు అవసరమైన నీటి కోసం హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా 18 కిలోమీటర్ల మేర ప్రత్యేక పైపులైన్ వేసి, 0.021 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నారు.ఖజానాకు కాసుల వర్షం.. రాయలసీమ యువతకు ఉపాధి!జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు కేవలం బంగారం తీయడమే కాదు.. రాయలసీమ రూపురేఖలను మార్చేయబోతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా 700 మందికి పైగా ఉపాధి లభించనుంది. ముఖ్యంగా, మైనింగ్ ప్రాంతంలో తిరిగే భారీ వాహనాలను నడిపేందుకు వీలుగా ఇక్కడి మహిళలకు