అవును.. పెనుకొండ మా జాగీరే
Actor ProfilePolitician

అవును.. పెనుకొండ మా జాగీరే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అవును.. పెనుకొండ మా జాగీరే
Andhra Jyothy1 Aug 2026
అవును.. పెనుకొండ మా జాగీరే

‘అభివృద్ధి, సంక్షేమం విషయంలో పెనుకొండ మా జాగీరే. మా తాత, మా నాన్న, నేను పుట్టింది ఇక్కడే. ఇది నా జాగీరే’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. పెనుకొండ(అనంతపురం): ‘అభివృద్ధి, సంక్షేమం విషయంలో పెనుకొండ మా జాగీరే. మా తాత, మా నాన్న, నేను పుట్టింది ఇక్కడే. ఇది నా జాగీరే’ అని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉష శ్రీచరణ్‌ తనపై లేనిపోని ఆరోపణలు చేశారని, ‘పెనుకొండ నీ అబ్బ జాగీరా?’ అని బహిరంగ సభలో ప్రశ్నించారని అన్నారు. ఉష శ్రీచరణ్‌ వ్యాఖ్యలపై మంత్రి ఘాటుగా స్పందించారు. పెనుకొండలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆమె మాట్లాడారు. అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌ కూటమి ప్రభుత్వమని అన్నారు. అభివృద్ధిని చూసి వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. పెనుకొండకు సేవచేసే భాగ్యాన్ని సీఎం చంద్రబాబు తనకు ఇచ్చారని, అభివృద్ధిలో తన తండ్రిబాటలో దూసుకుపోతున్నానని అన్నారు. కాబట్టి పెనుకొండ తన జాగీరేనని అన్నారు. నియోజకవర్గంలోని సీఎం సహాయనిధి లబ్ధిదారులకు ఆమె చెక్కులు పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నియోజకవర్గంలో 1306 మందికి రూ.13.45 కోట్లు సీఎం సహాయనిధి చెక్కులు ఇచ్చానని తెలిపారు. తాజాగా 121 మందికి రూ.1.15 కోట్లు మంజూరుకావడంతో లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చానని వెల్లడించారు. వైసీపీ పార్టీతో వ్యక్తిగతంగా ఎటువంటి శత్రుత్వం లేదు