అల్లు అరవింద్ క్లాప్ తో..వెంకీ
Actor ProfilePolitician

అల్లు అరవింద్ క్లాప్ తో..వెంకీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అల్లు అరవింద్ క్లాప్ తో..వెంకీ, కళ్యాణ్ రామ్ మూవీ ప్రారంభం
Vaartha18 Jun 2026
అల్లు అరవింద్ క్లాప్ తో..వెంకీ, కళ్యాణ్ రామ్ మూవీ ప్రారంభం

Venkatesh Kalyan Ram Multistarrer: టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల మధ్య జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకకు సినీ ప్రముఖులు హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టి సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. Read Also: Jananayagan Movie: విజయ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. జూన్ 26న ‘జననాయగన్’ విడుదలకు ప్లాన్? సీనియర్ స్టార్ హీరో వెంకటేష్, యువ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారిగా కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు, కామెడీ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాను కూడా వినోదాత్మకంగా తెరకెక్కించనున్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. వెంకటేష్ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ యాక్షన్ ఇమేజ్ కలయిక ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుండగా, విడుదల తేదీపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Union Minister Suresh Gopi: ఇంధన ధరల తగ్గింపునకు మరికొంత కాలం వేచి చూడాల్సిందే: కేంద్రం స్పష్టత గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Samantha Meets CM Vijay : సీఎం విజయ్ ని కలిసిన సమంత Venky -Anil Ravipudi Movie : వెంకీ-అనిల్ రావిపూడి మూవీ