అర్ధరాత్రి టీడీపీ ఎమ్మెల్యే వీరంగం..'చంపేస్తా' అంటూ బుల్ డోజర్ తో లాయర్ ఇంటి
Actor ProfilePolitician

అర్ధరాత్రి టీడీపీ ఎమ్మెల్యే వీరంగం..'చంపేస్తా' అంటూ బుల్ డోజర్ తో లాయర్ ఇంటి

Total News1
Movie Updates0
Sources1
అర్ధరాత్రి టీడీపీ ఎమ్మెల్యే వీరంగం..'చంపేస్తా' అంటూ బుల్ డోజర్ తో లాయర్ ఇంటిపై దాడికి యత్నం
Zee Telugu15 Jun 2026
అర్ధరాత్రి టీడీపీ ఎమ్మెల్యే వీరంగం..'చంపేస్తా' అంటూ బుల్ డోజర్ తో లాయర్ ఇంటిపై దాడికి యత్నం

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Chintamaneni Prabhakar News: పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి పెను సంచలనంగా మారారు. ఆదివారం అర్ధరాత్రి వేళ ఏలూరు నగరంలో ఆయన తన అనుచరులతో కలిసి చేసిన హల్‌చల్ స్థానికంగా తీవ్ర అలజడికి దారితీసింది. సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు నివాసమే లక్ష్యంగా ఎమ్మెల్యే ఈ దౌర్జన్యానికి దిగడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఆదివారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఏలూరు నగరంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భారీ అనుచర గణంతో పాటు ఏకంగా బుల్‌డోజర్ (JCB) వెంటబెట్టుకుని లాయర్ శ్రీనివాసబాబు ఇంటి ముందుకు వెళ్లారు. ఇంట్లో మహిళలు, పిల్లలు నిద్రిస్తున్నారనే విచక్షణ కూడా లేకుండా అర్ధరాత్రి వేళ అక్కడ బీభత్సం సృష్టించారు. "వాడో నేనో తేలాలి.." అంటూ నడిరోడ్డుపై కేకలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన చింతమనేని నడిరోడ్డుపై నిలబడి గట్టిగా అరుస్తూ, "వాడో నేనో తేలిపోవాలి.. చంపేస్తా!" అంటూ బహిరంగంగా ప్రాణహాని తలపెట్టేలా తీవ్ర బెదిరింపులకు దిగారు. తాను ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి అనే విషయాన్ని కూడా మరిచిపోయి, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల సమక్షంలోనే ఈ రేంజ్ వార్నింగ్‌లు ఇవ్వడం అక్కడ ఉన్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. నడిరోడ్డుపై సాగుతున్న ఈ హైడ్రామాను ఆపేందుకు చింతమనేని కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. "వద్దు నాన్న ప్లీజ్.. ఇక్కడి నుంచి వెళ్లిపోదాం" అంటూ ఆయన కుమార్తె తండ్రిని