
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) రక్తాశ్రువుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తమ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న సామాన్య ప్రజలపై పాకిస్తాన్ సైన్యాధినేత అసిమ్ మునీర్ సైన్యం అత్యంత క్రూరమైన నరమేధానికి తెరలేపింది. శత్రు దేశాలపై ప్రయోగించే అత్యాధునిక డ్రోన్లను.. సొంత పౌరులపైకి పంపి, బాంబుల వర్షం కురిపించడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. జూన్ 28 అర్ధరాత్రి దాటిన తర్వాత 12 నుంచి 1 గంటల మధ్య.. రావలకోట్ (Rawalakot) నగరంలో ఊహించని ఒక భయంకరమైన డ్రామా స్క్రీన్ ప్లేలా ఆవిష్కృతమైంది.అర్ధరాత్రి ఆకాశం నుంచి ఊడిపడ్డ మృత్యువు!ఆ సమయంలో వేలాది మంది నిరసనకారులు ఒకచోట చేరి టెంట్లు వేసుకుని శాంతియుతంగా కూర్చున్నారు. గాఢాంధకారంలో అకస్మాత్తుగా ఆకాశం నుంచి కొన్ని డ్రోన్లు దూసుకొచ్చాయి. నిరసన స్థలమే లక్ష్యంగా ఆ డ్రోన్ల నుంచి భారీ పేలుడు పదార్థాలను కిందకు జారవిడిచారు.అవామీ యాక్షన్ కమిటీ (Awami Action Committee) వెల్లడించిన వివరాల ప్రకారం.. కిందపడిన ఆ వస్తువులు సాధారణమైనవి కావు.. నిమిషాల వ్యవధిలో వేలాది మందిని బూడిద చేయగల భయంకరమైన RDX టైమర్ బాంబులు! టైమర్లు టిక్ టిక్ మంటూ ప్రాణాలు తీసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, స్థానిక నిర్వాహకులు ప్రాణాలకు తెగించి ఆ బాంబులను గుర్తించారు. క్షణాల వ్యవధిలో వాటిని అక్కడి నుంచి తొలగించి, నిర్వీర్యం చేయడంతో ఊహించని ఒక మహా నరమేధం తృటిలో తప్పింది. దీనికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఫుటేజ్‌ను కమిటీ విడుదల చేయడంతో పాక్ ఆర్మీ బండారం ప్రపంచం ముందు బట్టబయలైంది.కశ్మీరీల గొంతు నొక్కేందుకు ఇంటర్నెట్ బంద్.. ఆహార సరఫరా కట్!PoK లో గత కొన్ని వారాలుగా నిప్పు కణికలాంటి నిరసనలు ఎగసిపడుతున్నాయి. ద్రవ్యోల్బణం, కరెంట్ బిల్లుల బాదుడు, హక్కుల కాలరాశే ధ్యేయంగా ఇస్లామాబాద్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై ప్రజలు తిరగబడ్డారు. ఈ తిరుగుబాటు ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు జూన్ 5 నుంచి అక్కడ ఇంటర్నెట్ సేవలను పూర్తిగా బంద్ చేశారు.