అరుదైన వ్యాధిని జయించి సేవా బాటలో
Actor ProfilePolitician

అరుదైన వ్యాధిని జయించి సేవా బాటలో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అరుదైన వ్యాధిని జయించి సేవా బాటలో
Eenadu27 Aug 2026
అరుదైన వ్యాధిని జయించి సేవా బాటలో

దశరథ నాగేంద్ర ప్రసాద్, లక్ష్మి దంపతుల కుమార్తె లావణ్య. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట ఆమె స్వస్థలం. చిన్నప్పటి నుంచీ చదువుల్లో ప్రతిభావంతురాలు. డాక్టర్‌ కావాలన్నది ఆమె కల. దాంతో శ్రమించి నారాయణ మెడికల్‌ కళాశాలలో సీటు సాధించారు. ‘వైద్యో నారాయణో హరిః’ అంటారు. ప్రాణాలను కాపాడే వైద్యుడు దైవంతో సమానమని దీని అర్థం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల్ని కాపాడడమే కాదు, తనకు సోకిన ప్రాణాంతక వ్యాధిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు డాక్టర్‌ కుంకాల లావణ్య. తనలాంటి కష్టం ఇంకెవరికీ రాకూడదని దానిపై అవగాహన కల్పిస్తున్నారు. దశరథ నాగేంద్ర ప్రసాద్, లక్ష్మి దంపతుల కుమార్తె లావణ్య. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట ఆమె స్వస్థలం. చిన్నప్పటి నుంచీ చదువుల్లో ప్రతిభావంతురాలు. డాక్టర్‌ కావాలన్నది ఆమె కల. దాంతో శ్రమించి నారాయణ మెడికల్‌ కళాశాలలో సీటు సాధించారు. 2010-16 మధ్య ఎంబీబీఎస్, ఆపై బెంగళూరులోని సెయింట్‌ మార్తాస్‌ హాస్పిటల్‌లో డీఎన్‌బీ (జనరల్‌ మెడిసిన్‌)చేశారు. అనంతరం చెన్నైలో డీఎం(న్యూరాలజీ) పూర్తి చేసి గోల్డ్‌ మెడల్‌ సాధించారు. తర్వాత నెల్లూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. ఆపై కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ నాగేంద్ర ప్రసాద్‌తో లావణ్యకు వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. స్థానికంగానే వైద్యురాలిగా ప్రాక్టీస్‌ ప్రారంభించారు. అప్పటికి ఆమె జీవితం హాయిగా, కెరియర్‌ ఉన్నతంగా సాగిపోతున్నాయి. కాలం ఎప్పుడూ మనం ఊహించినట్లు ఉండదుగా! అప్పుడప్పుడూ కఠిన పరీక్షలూ పెడుతుంది. లావణ్యకూ ఈ పరిస్థితి ఎదురైంది. అది 2025 జనవరి నెల. ఒక రోజు... అప్పటివరకు హుషారుగా ఉన్న లావణ్యకు అకస్మాత్తుగా మాట పడిపోయింది. ఆపై కాసేపటికే నిలబడలేని పరిస్థితి. మొదట చిన్న సమస్యే అని సర్దిచెప్పుకొన్నా... మనసులో ఏదో అలజడి. రకరకాల పరీక్షలు చేయించుకున్నారామె. అప్పుడు బయటపడిన పేరే మయస్థీనియా గ్రావిస్‌. ఇది అరుదైన, దీర్ఘకాలిక ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. మన శరీరంలోని రోగ నిరోధక