
Samantha Ruth Prabhu: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారం సినిమాతో మంచి విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. మహిళల జీవితాలు, కుటుంబ బంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. విడుదలైన తొలి రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా విజయోత్సాహంలో ఉన్న సమంత గురించి తాజాగా ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న తర్వాత సమంత కుటుంబ సభ్యులతో ఎంతో ఆప్యాయంగా మెలుగుతున్నారని ఇప్పటికే పలువురు చెప్పుకొచ్చారు. తాజాగా రాజ్ నిడిమోరు సోదరి శీతల్ నిడిమోరు చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సమంత తన జీవితంలో మరచిపోలేని ఓ సంఘటన గురించి ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. శీతల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒకరోజు అర్థరాత్రి సమయంలో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చలి జ్వరం, వాంతులు, తీవ్రమైన తలనొప్పితో మంచం దిగలేని పరిస్థితి ఏర్పడింది. ఇంట్లో అందరూ నిద్రలో ఉండటంతో ఏం చేయాలో అర్థం కాక ఫ్యామిలీ గ్రూప్‌లో మెసేజ్ పెట్టాలా వద్దా అని చాలా సేపు ఆలోచించారట. చివరకు ధైర్యం చేసి మెసేజ్ పంపగానే సమంత వెంటనే స్పందించి నేను వస్తున్నా అని చెప్పిందని శీతల్ గుర్తు చేసుకున్నారు. అంతేకాదు, ఇంట్లో ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా నేరుగా తన గదికి వచ్చిన సమంత, దుప్పట్లు లేకపోవడంతో పెద్ద టవల్స్ తీసుకొచ్చి కప్పిందని తెలిపారు. మందులు, నీళ్లు అందించడంతో పాటు రాత్రంతా తన ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ పక్కనే ఉన్నారని వెల్లడించారు. మరుసటి రోజు షూటింగ్ ఉన్నప్పటికీ సమంత ఎలాంటి అసహనం చూపకుండా తనకు అండగా నిలిచిందని శీతల్ పేర్కొన్నారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ రాత్రంతా నిద్ర లేకపోయినా మరుసటి రోజు షూటింగ్‌లో సమంత పూర్తి ఉత్సాహంతో పాల్గొన్నారని చెప్పారు. చీరలో యాక్షన్ సన్నివేశాలు