అరుణాచల్ ప్రదేశ్ లో చైనా చొరబాట్లంటూ ప్రచారం.. స్పందించిన భారత సైన్యం
Actor ProfileCelebrity

అరుణాచల్ ప్రదేశ్ లో చైనా చొరబాట్లంటూ ప్రచారం.. స్పందించిన భారత సైన్యం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అరుణాచల్ ప్రదేశ్ లో చైనా చొరబాట్లంటూ ప్రచారం.. స్పందించిన భారత సైన్యం
Eenadu20 Aug 2026
అరుణాచల్ ప్రదేశ్ లో చైనా చొరబాట్లంటూ ప్రచారం.. స్పందించిన భారత సైన్యం

Fact Check| ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ (PLA) అరుణాచల్‌ ప్రదేశ్‌లో చొరబాట్లకు పాల్పడిందని, అక్కడ సైనిక శిబిరాలను ఏర్పాటు చేసిందని కొన్ని కథనాలు ప్రచారం అవుతున్నాయి. వాటిని భారత సైన్యం తోసిపుచ్చింది. ఆ కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ‘‘అదంతా ఎలాంటి ఆధారం లేకుండా జరుగుతోన్న అసత్య ప్రచారం’’ అని వెల్లడించింది. మీడియా కథనాల ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్‌ (Arunachal Pradesh)లోని తక్సింగ్‌ ప్రాంతంలోని నాహ్‌ ట్రైబల్ గ్రూప్‌నకు చెందిన నాహ్‌ వెల్ఫేర్ సొసైటీ .. ప్రభుత్వ అధికారులకు గతంలో ఒక వినతి ప్రతాన్ని సమర్పించింది. భారత్-చైనా సరిహద్దు సమీపంలో పీఎల్‌ఏ శిబిరాలను ఏర్పాటు చేసిందని అందులో ఆరోపించింది. గత 10- 15 సంవత్సరాలుగా చైనా సైనికులు తక్సింగ్‌ సరిహద్దు వెంట చొరబాట్లను క్రమంగా విస్తరిస్తున్నారని పేర్కొంది. వేట, పశువుల మేత, అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం స్థానికులు ఉపయోగించే ప్రదేశాల్లో రోడ్లు, వంతెనలు, సైనిక శిబిరాలను నిర్మించారని ఆరోపించింది. ఆ ప్రాంతాల పేర్లను ప్రస్తావించింది. భారత సరిహద్దు ప్రాంతాల్లో చైనా కార్యకలాపాలు మరింత విస్తరించకుండా నిరోధించేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని కోరింది. ఈ వినతి పత్రాన్నే మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆర్మీ స్పందన వచ్చింది. ఇటీవల బీజింగ్‌లో భారత్‌-చైనా సరిహద్దు వ్యవహారాలకు సంబంధించిన సమావేశం జరిగింది. రెండు దేశాల మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే మీడియా కథనాలు రావడం గమనార్హం. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర