అర్జున్ రెడ్డి హిట్ .. రేవంత్ రెడ్డి ఫట్
Actor ProfilePolitician

అర్జున్ రెడ్డి హిట్ .. రేవంత్ రెడ్డి ఫట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అర్జున్ రెడ్డి హిట్ .. రేవంత్ రెడ్డి ఫట్
Sakshi27 Jun 2026
అర్జున్ రెడ్డి హిట్ .. రేవంత్ రెడ్డి ఫట్

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శలు శంషాబాద్‌: ‘‘ఆమధ్య విడుదలైన అర్జున్‌రెడ్డి అనే సినిమా సూపర్‌ హిట్‌ అయ్యింది.. కానీ మన రాష్ట్రంలో ఇంటర్వెల్‌ వరకు వచ్చిన రేవంత్‌రెడ్డి సినిమా మాత్రం ఫట్‌ అయ్యింది. సినిమా ఫ్లాప్‌ అయితే నిర్మాత నష్టపోతాడు. కానీ ఇక్కడ మాత్రం రేవంత్‌రెడ్డి సినిమాతో రాష్ట్రంలో 4 కోట్ల మంది నష్టపోతున్నారు’’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు విమర్శించారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ నేతలకు ఆదివారం శంషాబాద్‌లో నిర్వహించిన ‘సర్‌’ప్రక్రియ అవగాహన కార్యక్రమానికి కేటీఆర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని గప్పాలు చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి... ఎన్నికల హామీ మేరకు రాష్ట్రంలోని 1.67 కోట్ల ఆడబిడ్డల ఖాతాల్లో రూ. లక్షన్నర చొప్పున జమ చేస్తే రాజకీయాలను మానేస్తానని సవాల్‌ విసిరారు. నిరుద్యోగులకు ఇస్తానన్న రూ. 4 వేలతోపాటు పెన్షన్‌ను రూ. 4 వేలకు పెంచుతానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాహుల్‌బంధు మాత్రమే : రాష్ట్రంలో ప్రస్తుతం రైతుబంధు లేదని.. రాహుల్‌ బంధు మా త్రమే ఉందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రైతులకు యురియా లేదని.. కనీసం వాటిని దాచుకోవడానికి సంచులు ఇక్కడ ఇవ్వలేని దుస్థితిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి రెగ్యులర్‌ సీఎం కాదని సంచులు ముట్టజెప్పి రెన్యూవల్‌ చేయించు కుంటున్న సీఎం మాత్రమేనని వ్యాఖ్యానించారు. సర్‌ ప్రక్రియను బూత్‌ స్థాయి కార్యకర్తలు నిశితంగా పరిశీలించి దొంగ ఓట్లను తీయించి అసలు ఓట్లు ఉండేలా చూడాలన్నారు. అలాగే క్రియాశీల సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, మహేశ్వర్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.సబితారెడ్డి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కార్తీక్‌రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్, ఎమ్మెల్సీలు నవీన్‌కుమార్‌రెడ్డి, వాణీదేవి తదితరులున్నారు. ఫాదర్స్ డే స్పెషల్.. టాలీవుడ్ సెలబ్రిటీలు ఇలా (ఫొటోలు) మేనిఛాయతో మెరిసిపోతున్న కృతిశెట్టి (ఫొటోలు) ట్రెండింగ్‌లో సమంత