అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. ఏఐ రాకతో శబరిమలలో భారీ మార్పులు
Actor ProfilePolitician

అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. ఏఐ రాకతో శబరిమలలో భారీ మార్పులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. ఏఐ రాకతో శబరిమలలో భారీ మార్పులు
Asianet News Telugu30 Jun 2026
అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. ఏఐ రాకతో శబరిమలలో భారీ మార్పులు

కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు ఈ ఏడాది సరికొత్త, హైటెక్ అనుభూతి కలగబోతోంది. ప్రతి ఏటా ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే ఈసారి రద్దీని తట్టుకునేందుకు కేరళ పోలీస్, ట్రావెన్‌కూర్ దేవస్వం బోర్డు (TDB) నేరుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకోనున్నాయి. దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇకపై డ్రోన్లు, ఏఐ కెమెరాలు, ప్రెడిక్టివ్ సిస్టమ్స్ ద్వారా భద్రతను, భక్తుల రద్దీని పర్యవేక్షించనున్నారు. ఈ ఏడాది నవంబర్ నెల నుంచి ఈ సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. శబరిమల కొండ కేరళలోని పతనంతిట్ట జిల్లాలో దట్టమైన అడవుల మధ్య ఉంది. గత ఏడాది ఇక్కడ రికార్డు స్థాయిలో 51 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇంత భారీ మొత్తంలో వచ్చే జనాన్ని కంట్రోల్ చేయడం పోలీసులకు, అధికారులకు ఎప్పుడూ పెద్ద టాస్కే. అందుకే ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఢిల్లీ, చెన్నై, ముంబై నగరాలకు చెందిన మూడు పెద్ద ఏఐ కంపెనీలు ఒక స్పెషల్ ప్రపోజల్ సిద్ధం చేశాయి. శనివారం జరిగిన ఒక హై-లెవల్ మీటింగ్‌లో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నవంబర్ నుంచి ఫేజ్ ల వారీగా ఈ ఏఐ సాంకేతికతను అమలు చేయనున్నారు. పతనంతిట్ట జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆర్. ఆనంద్ చెప్పిన వివరాల ప్రకారం.. ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఇదివరకే మహాకుంభమేళా, ఇతర పెద్ద పెద్ద ఉత్సవాల్లో సక్సెస్‌ఫుల్‌గా వాడారు. కానీ శబరిమల భౌగోళిక పరిస్థితి వేరు. ఇది దట్టమైన అడవిలో ఉంది కాబట్టి ఇక్కడి కోసం ఒక ప్రత్యేకమైన ఏఐ సొల్యూషన్‌ను డిజైన్ చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య కో-ఆర్డినేషన్ పెంచడానికి, భక్తుల భద్రతను కరెక్ట్‌గా ప్లాన్ చేయడానికి ఈ సిస్టమ్ ఒక గేమ్ ఛేంజర్ కానుంది. ఈ కొత్త టెక్నాలజీ వల్ల భక్తులకు చాలా లాభాలు ఉన్నాయి