అయ్యో రామా.. ఇంత చేసినా నీట్ ఎగ్జామ్ లో ఆగని మాల్ ప్రాక్టీస్.. విద్యార్ధి అరెస్ట్
Actor ProfileCelebrity

అయ్యో రామా.. ఇంత చేసినా నీట్ ఎగ్జామ్ లో ఆగని మాల్ ప్రాక్టీస్.. విద్యార్ధి అరెస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అయ్యో రామా.. ఇంత చేసినా నీట్ ఎగ్జామ్ లో ఆగని మాల్ ప్రాక్టీస్.. విద్యార్ధి అరెస్ట్
Zee Telugu27 Jun 2026
అయ్యో రామా.. ఇంత చేసినా నీట్ ఎగ్జామ్ లో ఆగని మాల్ ప్రాక్టీస్.. విద్యార్ధి అరెస్ట్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. నీట్‌ పరీక్ష మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడిన విద్యార్థి అరెస్టు: దేశ వ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశించే వారికి కోసం నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షను ప్రభుత్వం ఎన్నో కట్టుదిట్టమైన భద్రతల నడము నిర్వహించింది. నీట్ పరీక్ష నేపథ్యంలో ప్రశ్నా పత్రాలు లీక్ కాకుండా టెలిగ్రామ్ వంటి యాప్స్‌పై కొన్ని రోజుల పాటు నిషేధం విధించింది. తాజాగా నిన్న జరిగిన నీట్ ఎగ్జామ్ లో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటకు చెందిన ఓ విద్యార్ధి ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఉదయం 7 గంటలకే పరీక్షా కేంద్రానికి చేరుకొని టాయిలెట్ వెంటిలేటర్ ద్వారా మొబైల్ లోపల పెట్టి వెళ్లాడు. పరీక్ష జరుగుతున్న సమయంలో విద్యార్ధి కడుపు నొప్పి అంటూ టాయిలెట్‌కు వెళ్లాడు సదరు విద్యార్ధి. విద్యార్ధి టాయిలెట్‌లోకి వెళ్లి చాలా సేపటి వరకు రాకపోవడంతో ఇన్విజిలేటర్‌కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో గూగుల్ క్రోమ్‌లో నీట్ ఎగ్జామ్‌లో వచ్చిన ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ అడ్డంగా దొరికిపోయాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అతను మొబైల్ ఫోన్ పెట్టడం దగ్గర నుంచి అన్ని వివరాలపై కూపీ లాగుతున్నారు. ఇందులో ఇతని ఒక్కడి ప్రమేయం ఉందా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భావి భారత డాక్టర్లు కావాల్సిన వాళ్లు ఇలా