
Jnaneswari Missing Case Updates: కాకినాడ జిల్లా తుని పరిధిలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అలియాస్ జాను ఆచూకీ కోసం వారం రోజులుగా సాగుతున్న గాలింపు చర్యల్లో తీవ్ర నిరాశే ఎదురవుతోంది. చిన్నారి ప్రాణ స్నేహితుడైన పెంపుడు కుక్క శనివారం నాడు మృతి చెందడం ఈ ఉదంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నేటితో చిన్నారి అదృశ్యమై ఏడు రోజులు గడుస్తున్నా ఎలాంటి క్లూ లభించకపోవడంతో అటు తల్లిదండ్రులు, ఇటు పోలీస్ యంత్రాంగం తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. వారం రోజుల క్రితం దట్టమైన అటవీ ప్రాంతం సమీపంలో రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైంది. ఆమెతో పాటు వెళ్లిన పెంపుడు కుక్కకు పాప ఎక్కడుందో తెలిసి ఉంటుందని అందరూ ఆశించారు. కాగా, నాలుగు రోజుల క్రితం ఒంటిపై తీవ్ర గాయాలతో ఆ కుక్క ఒంటరిగా ఇంటికి చేరుకుంది. నిన్న (శుక్రవారం) సాయంత్రం వరకు కూడా ఆ విశ్వాసంగల మూగజీవి ఇల్లంతా, ఇంటి పరిసరాల్లోనూ చిన్నారి జాను కోసం వెతుకుతూనే ఉంది. గాయాలతో తిరిగి వచ్చిన పెంపుడు కుక్కను ఆధారంగా చేసుకుని పాప ఆచూకీ కనుగొనవచ్చని పోలీసులు భావించారు. దట్టమైన అటవీ ప్రాంతంలో చిన్నారిని వెతికేందుకు ఆ కుక్కకు ఏకంగా జీపీఎస్ (GPS) ట్రాకర్ అమర్చి అడవిలోకి పంపే సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అయితే, జీపీఎస్ అమర్చిన తర్వాత ఆ కుక్క అడవిలో దాదాపు 8 కిలోమీటర్లు ప్రయాణించి, తిరిగి ఇంటికే వచ్చేసింది కానీ పాప ఉన్న ప్రాంతాన్ని చూపించలేకపోయింది. దీంతో క్షేత్రస్థాయిలో పోలీసులు చేసిన ఈ సరికొత్త ప్రయోగం పూర్తిగా విఫలమైంది. Read Also :Four Maoists granted bail: విజయవాడలో అరెస్టైన నలుగురు మావోయిస్టులకు బెయిల్! తీవ్రమైన గాయాలు, అడవిలో ఎదురైన పరిస్థితుల కారణంగా ఆ కుక్క తీవ్ర అనారోగ్యానికి గురైంది. గత కొంతసమయంగా పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ దీనస్థితికి చేరుకున్న ఆ పెంపుడు కుక్క, శనివారం నాడు కన్నుమూసింది. కంటికి