అయోధ్యలో కుంభమేళా సమయంలోనే భారీగా దోపిడీ.. సూత్రధారులు ఇద్దరు బావమరుదులే
Actor ProfilePolitician

అయోధ్యలో కుంభమేళా సమయంలోనే భారీగా దోపిడీ.. సూత్రధారులు ఇద్దరు బావమరుదులే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అయోధ్యలో కుంభమేళా సమయంలోనే భారీగా దోపిడీ.. సూత్రధారులు ఇద్దరు బావమరుదులే
Samayam Telugu28 Aug 2026
అయోధ్యలో కుంభమేళా సమయంలోనే భారీగా దోపిడీ.. సూత్రధారులు ఇద్దరు బావమరుదులే

అయోధ్య రామమందిర విరాళాల చోరీ అంశంపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పలువురి నిందితులను పోలీసులు విచారిస్తుండగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రామ మందిర విరాళాల దోపిడీకి సంబంధించి మరో సంచలన విషయం బయటపడింది. గతేడాది ప్రయాగ్‌రాజ్ కుంభమేళా సమయంలోనే భారీగా దోచేసినట్టు విచారణలో తేలింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ కేసులో అరెస్టైన ఎనిమిది మంది నిందితుల్లో కొందరు కుంభమేళాకు ముందు చిన్న మొత్తంలో దొంగిలించేవారు. కానీ, కుంభమేళా సమయంలో భారీగా భక్తులు, కానుకలు వెల్లువెత్తాయి. దీనిని ఆసరాగా చేసుకుని ఒకరితోకరు చేతులు కలిపిన నిందితులు పెద్ద ఎత్తున ఈ దోపిడీకి ఒడిగట్టారు.నిధుల గోల్‌మాల్‌పై దర్యాప్తునకు యూపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఆలయంలో పనిచేసే అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవ్ కుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రమాశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రామ్‌శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్‌లను అరెస్ట్ చేసింది. నిందితులను మంగళవారం గంటల తరబడి విచారించిన సిట్ అధికారులు.. ఈ ఎనిమిది మంది కలిసే కుట్ర పన్నారని స్పష్టం చేశారు.అయితే, లవ్‌కుష్ మిశ్రా, అనుకల్ప్ మిశ్రా అనే ఇద్దరు బావమరుదుల జోడి అధిక మొత్తంలో నగదును దొంగిలించినట్లు తేలింది. అంతేకాదు, తస్కరించిన ఈ సొమ్ముతో వారు పలు ఆస్తులను కూడా కొనుగోలు చేసినట్టు తెలిసింది. వీరిద్దరికీ సంబంధించి దాదాపు అర డజనుకుపైగా ఆస్తులను పోలీసులు ఇప్పటివరకు గుర్తించారు. వీరి ఆర్థిక లావాదేవీలు, ఆస్తులను నిశితంగా పరిశీలించేందుకు పోలీసులు ఆదాయపు పన్ను శాఖ అధికారుల సహాయం తీసుకుంటున్నారు. అలాగే, మనీల్యాండరింగ్, ఆర్థిక వ్యవహారాలపై లోతైన విచారణ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు లేఖ రాయనున్నారు. విచారణలో కొందరు ఎస్బీఐ సిబ్బంది పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు.ఆలయంలో విరాళాల నగదు లెక్కింపును ఎస్బీఐ పర్యవేక్షిస్తోంది. ఇందుకోసం ఒక ప్రైవేట్ ఏజెన్సీని నియమించింది. నాలుగు విరాళాల పెట్టెలలో జమ చేసిన నగదును, 11