అయోధ్య విరాళాల వివాదం.. సిట్ ఏర్పాటు చేయాలని వినతి
Actor ProfilePolitician

అయోధ్య విరాళాల వివాదం.. సిట్ ఏర్పాటు చేయాలని వినతి

Total News1
Movie Updates0
Sources1
అయోధ్య విరాళాల వివాదం.. సిట్ ఏర్పాటు చేయాలని వినతి
Eenadu13 Jun 2026
అయోధ్య విరాళాల వివాదం.. సిట్ ఏర్పాటు చేయాలని వినతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: అయోధ్య రామ మందిర (Ayodhya Ram Mandir)విరాళాలు, కానుకల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరపాలని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ యూపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ విషయంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)తో విచారణ జరిపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కోరింది. అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ అలహాబాద్‌ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. న్యాయవాది మోహిత్ అశోక్ దీన్ని దాఖలు చేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఖాతాలపై కాగ్‌ ద్వారా సమగ్రమైన ఆడిట్ కూడా నిర్వహించాలని కోరారు. విరాళాల విషయంలో చాలాకాలంగా అవకతవకలు జరుగుతున్నాయని రామ మందిర అకౌంట్స్‌ ఇన్‌ఛార్జిగా ఉన్నానని చెప్పుకొంటున్న మహిపాల్‌ సింగ్‌ ఆరోపించడంతో ఈ వివాదం నెలకొంది. ఈ విషయంపై ఫిర్యాదు చేసినందుకే తనను విధుల నుంచి తొలగించారని సింగ్‌ తెలిపారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు