అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్తుండగా యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడి అరెస్ట్
Actor ProfilePolitician

అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్తుండగా యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడి అరెస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్తుండగా యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడి అరెస్ట్
Samayam Telugu20 Aug 2026
అయోధ్య రామయ్య దర్శనానికి వెళ్తుండగా యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడి అరెస్ట్

Ajay Rai Ayodhya Arrest : ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మంగళవారం భారీ హైడ్రామా చోటుచేసుకుంది. అయోధ్యలోని రామ్ జన్మభూమి ఆలయాన్ని సందర్శించి, రామ్‌లల్లాను దర్శించుకోవడానికి కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో కలిసి వెళ్తున్న యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్‌ను పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు. తాను అయోధ్యకు చేరుకుని హోటల్‌లో అడుగు పెట్టిన వెంటనే.. యూపీ పోలీసులు తనను గది నుంచే బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ జీపులో తరలించారని అజయ్ రాయ్ స్వయంగా ఆరోపించారు. ఈ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించిన ఆయన.. బీజేపీ ప్రభుత్వ నియంతృత్వానికి ఇది పరాకాష్ట అని మండిపడ్డారు.యోగీ ప్రభుత్వంపై ‘చడావా చోర్’ అంటూ ట్వీట్ఈ అరెస్ట్ ఉదంతంపై అజయ్ రాయ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఆయన "చడావా చోర్" (కానుకలు, చందాలు దొంగిలించే దొంగలు) అని సంబోధించారు. "రాముడి పాదాల చెంత ఆశీస్సులు తీసుకోవడానికి వస్తున్న కాంగ్రెస్ ప్రతినిధి బృందాన్ని చూసి బీజేపీ ప్రభుత్వం వణికిపోతోంది. అయోధ్యలో భూ కుంభకోణాలు, రామాలయ చందాల దొంగతనానికి పాల్పడుతున్న ఈ 'చందా దొంగలు'.. రామభక్తుల రాకను చూసి ఎందుకు అంతగా భయపడుతున్నారు? దేవుడి పేరుతో దుకాణాలు నడిపే వారు చేస్తున్న ఇలాంటి పిరికిపంద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఆగేది లేదు, లొంగేది లేదు" అంటూ ట్వీట్ చేశారు. అజయ్ రాయ్‌తో పాటు ప్రతాప్‌గఢ్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నీరజ్ త్రిపాఠిని కూడా పోలీసులు గృహనిర్బంధం చేసి అదుపులోకి తీసుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది.రాముడు ఎవరి సొత్తూ కాదు..!యూపీలో శ్రీరాముడిని దర్శించుకోవడం కూడా నేరంగా మారిందా? అని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రశ్నించింది. రాముడు ఏ ఒక్క రాజకీయ పార్టీకో లేదా సిద్ధాంతానికో పరిమితమైన వాడు కాదని, ఆయన దేశ సంస్కృతికి, యావత్ ప్రజల నమ్మకానికి ప్రతీక అని పేర్కొంది. భక్తులను అయోధ్యకు వెళ్లకుండా అడ్డుకోవడం ముమ్మాటికీ రాజ్యాంగ