అయోధ్య రామమందిర విరాళాల వివాదం లో కీలక మలుపు.. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్
Actor ProfilePolitician

అయోధ్య రామమందిర విరాళాల వివాదం లో కీలక మలుపు.. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అయోధ్య రామమందిర విరాళాల వివాదం లో కీలక మలుపు.. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్
Andhra Jyothy26 Jul 2026
అయోధ్య రామమందిర విరాళాల వివాదం లో కీలక మలుపు.. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. లక్నో, జూన్ 26: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిధుల దుర్వినియోగం వ్యవహారంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఆలయ విరాళాల లెక్కింపు ప్రక్రియతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను గురువారం రాత్రి అయోధ్యలోనే అరెస్ట్ చేసినట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు. ఈ నెల ప్రారంభంలో విరాళాల నిధుల మళ్లింపు ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు.. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వీటిని తోసిపుచ్చారు. అయితే, వివాదం ముదరడంతో ట్రస్ట్ విజ్ఞప్తి మేరకు యూపీ ప్రభుత్వం జూన్ 13న ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. జూన్ 23న SIT తన ప్రాథమిక నివేదికను సమర్పించిన రెండు రోజులకే ఈ అరెస్టులు జరిగాయి. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద దొంగతనం (సెక్షన్ 306), క్రిమినల్ నమ్మకద్రోహం (సెక్షన్ 316), దొంగిలించిన ఆస్తిని కలిగి ఉండటం (సెక్షన్ 317), క్రిమినల్ ప్లాన్/కుట్ర (సెక్షన్ 61) వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అరెస్టయిన ఆ ఎనిమిది మంది ఎవరు? వారి పాత్ర ఏమిటనే విషయానికొస్తే.. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ (FIR) ప్రకారం అరెస్టయిన ఎనిమిది మంది ఆలయ విరాళాల లెక్కింపులో కీలక పాత్ర పోషించినట్లు తేలింది. 1. రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్ (కీలక సూత్రధారి): ఈ వివాదంలో అత్యంత ప్రముఖమైన వ్యక్తి ఇతనే. ఇతడు ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌కు మాజీ డ్రైవర్‌గా వ్యవహరించాడు. విరాళాల పెట్టెల తాళంచెవులు ఇతని వద్దే ఉండేవని, ట్రస్ట్ సభ్యులకు సన్నిహితుడు కావడంతో