అయోధ్య చోరీ దర్యాప్తులో తవ్వేకొద్దీ షాకులు
Actor ProfilePolitician

అయోధ్య చోరీ దర్యాప్తులో తవ్వేకొద్దీ షాకులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అయోధ్య చోరీ దర్యాప్తులో తవ్వేకొద్దీ షాకులు-సీసీటీవీలు కప్పేసి, టాయిలెట్లలో దాచేసి
Oneindia Telugu27 Aug 2026
అయోధ్య చోరీ దర్యాప్తులో తవ్వేకొద్దీ షాకులు-సీసీటీవీలు కప్పేసి, టాయిలెట్లలో దాచేసి

అయోధ్య రామమందిర కానుకల చోరీ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరం కావడంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భక్తులు సమర్పించిన విరాళాల సొమ్మును మళ్లించేందుకు నిందితులు వేసిన వ్యూహాలు దర్యాప్తు అధికారులనే ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా ఆలయానికి వచ్చిన విరాళాల్ని అక్రమార్కులు ఎలా బయటికి తరలించారో క్రమంగా గుట్టు వీడుతోంది. కోర్టు అనుమతితో నిందితుడు అవినాష్ శుక్లాను పోలీసులు దాదాపు రెండు గంటల పాటు ముమ్మరంగా విచారించగా.. తాము చేసిన కోట్ల రూపాయల నిధుల మళ్లింపు వెనుక ఉన్న రహస్యాలను అతడు పూర్తిగా ఒప్పుకున్నాడు. ట్రస్ట్‌లో కీలక సభ్యుడిగా ఉన్న అనిల్ మిశ్రా విరాళాల లెక్కింపు ప్రక్రియలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించారని శుక్లా వెల్లడించాడు. ఆలయ విరాళాల నిర్వహణపై తీవ్ర విమర్శలు రావడంతో అనిల్ మిశ్రాతో పాటు ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఇటీవల తమ పదవుల నుంచి తప్పుకున్నారు. వాష్ రూమ్ ల్లో నగదు దాచేసి.. (Ayodhya)ఆలయ విరాళాల లెక్కింపు గది నుంచి భారీగా నగదును అపహరించి, దానిని ఎవరికీ అనుమానం రాకుండా ఆలయ ప్రాంగణంలోని వాష్‌రూముల్లో తాత్కాలికంగా దాచిపెట్టేవారని దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత అనువైన సమయం చూసుకుని ఆ సొమ్మును బయటకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ సభ్యుల ప్రమేయంపై అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పద్ధతిలో దొంగిలించిన నగదును ఆలయ కాంప్లెక్స్ వెలుపలికి నేరుగా తీసుకువెళ్తే భద్రతా తనిఖీల్లో దొరికిపోయే ప్రమాదం ఉందని గ్రహించారు. అందుకే అత్యంత పక్కాగా వ్యూహం రచించి, ఆ సొమ్మును ఆలయం లోపల ఉన్న వాష్‌రూముల్లో తాత్కాలికంగా దాచిపెట్టేవారు. ట్రస్ట్ కీలక సభ్యులతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా నిందితులను ఆలయ భద్రతా సిబ్బంది పెద్దగా అనుమానించలేదు. అనుకూలమైన పరిస్థితులు చూసుకుని, ఎవరికీ అనుమానం రాకుండా ఆ సొమ్మును క్రమంగా బయటకు తరలించేవారని సమాచారం.సీసీకెమెరాలకు అడ్డంగా నిలబడి...