
అమరావతిలో వైసీపీ నేతల పర్యటన రైతుల నుంచి తీవ్ర నిరసనలు కోడిగుడ్లు రాళ్లతో దాడులు Amaravati: అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఆర్డీఏ (CRDA) పరిరక్షణ బృందానికి తీవ్ర నిరసన ఎదురైంది. తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ వద్ద రాజధాని భూములను పరిశీలించేందుకు వెళ్తున్న వైసీపీ నేతలు పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డిలను అమరావతి(Amaravati) రైతులు అడ్డుకున్నారు. "గో బ్యాక్ వైసీపీ" అంటూ నల్ల బ్యాడ్జీలతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. Mission Vatsalya: ఏపీలో పిల్లలకు గుడ్ న్యూస్.. ప్రతి నెలా రూ.4 వేలు.. డైరెక్ట్ అకౌంట్ లోకే ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోవడంతో ఉండవల్లి ప్రాంతం రణరంగంగా మారింది. నిరసనకారులు వైసీపీ నేతలపై కోడిగుడ్లు విసిరారు. అలాగే లేళ్ల అప్పిరెడ్డి ప్రయాణిస్తున్న కారుపై రాళ్లు రువ్వడంతో ఆ వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ హఠాత్ పరిణామంతో రాజధాని పరిసర ప్రాంతాల్లో రాజకీయ ఉద్రిక్తత ఒక్కసారిగా పీక్‌కు చేరింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ ఉద్రిక్తత తగ్గలేదు. ఆందోళనకారులు పోలీసులపై కూడా రాళ్లు రువ్వడంతో పలువురు సిబ్బంది గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడ భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో అమరావతిలో రాజకీయ సెగలు మరోసారి రాజుకున్నాయి