అమరావతిలో.. బాలయ్య
Actor ProfileActor

అమరావతిలో.. బాలయ్య

Total News1
Movie Updates0
Sources1
అమరావతిలో.. బాలయ్య-కొరటాల శివ సినిమా ప్రారంభం
Chitrajyothy15 Jun 2026
అమరావతిలో.. బాలయ్య-కొరటాల శివ సినిమా ప్రారంభం

ప్ర‌స్తుతం ‘NBK 111’తో బిజీగా ఉన్న నటసింహం బాలకృష్ణ.. తదుపరి స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో చేయ‌నున్న సినిమాకు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర విష‌యం నెట్టింట హాల్చ‌ల్ చేస్తోంది. వయసు పెరుగుతున్నా కొద్దీ నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఎనర్జీ ఏ స్థాయిలో రెట్టింపు అవుతోందో మనం చూస్తూనే ఉన్నాం. బాక్సాఫీస్ దగ్గర వరుస రికార్డులు క్రియేట్ చేస్తూ, కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని వేగంతో బాలయ్య బాబు ఫుల్ స్వింగ్‌లో దూసుకు పోతున్నారు. అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఆయన.. ఇప్పుడు మరో అదిరిపోయే అప్‌డేట్‌తో మన ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'NBK 111' ప్రాజెక్ట్‌ను శరవేగంగా పూర్తి చేసే పనిలో బాలయ్య బిజీగా ఉన్నారు. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ టీజర్ చూస్తే అభిమానులకు ఓ రేంజ్‌లో పూనకాలు వస్తున్నాయి. అందులో ఆయన గెటప్, డైలాగ్ డెలివరీ అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ సినిమా షూటింగ్ ఓ పక్క సాగుతుండగానే.. నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాను లైనప్ చేయడం బాలయ్యకు మొదటి నుంచి అలవాటే. అదే ట్రాక్‌లో ఇప్పుడు స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. మాస్ కి కేరాఫ్ అడ్రస్ అయిన బాలకృష్ణ, కమర్షియల్ అంశాలకు సామాజిక సందేశాన్ని బలంగా జోడించే కొరటాల శివ (Koratala Siva). ఈ ఇద్దరి కలయిక అనగానే ఇండస్ట్రీలో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. వీరిద్దరూ కలిసి ఏ స్థాయిలో మాస్ జాతర చూపించబోతున్నారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా లాంచింగ్ ఈవెంట్