అమరావతి మావిగన్.. జగన్ 'మావిగన్' సవాలు
Actor ProfilePolitician

అమరావతి మావిగన్.. జగన్ 'మావిగన్' సవాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అమరావతి మావిగన్.. జగన్ 'మావిగన్' సవాలుపై ఘాటుగా స్పందించిన సీఎం చంద్రబాబు
Zee Telugu2 Sept 2026
అమరావతి మావిగన్.. జగన్ 'మావిగన్' సవాలుపై ఘాటుగా స్పందించిన సీఎం చంద్రబాబు

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Amaravati Vs Mavigun News: ఆంధ్రప్రదేశ్ రాజధాని చుట్టూ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అమరావతికి ప్రత్యామ్నాయంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన 'మావిగన్' (మచిలీపట్నం - విజయవాడ - గుంటూరు) కాన్సెప్ట్ ఇప్పుడు రాష్ట్రంలో కొత్త చర్చకు తెరలేపింది. ఈ నేపథ్యంలో జగన్ విసిరిన సవాల్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. జగన్ సవాల్ ఏమిటి? కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అమరావతి రాజధాని నిర్మాణాన్ని జగన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ.. దానికి బదులుగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ 'మావిగన్' అనే సరికొత్త మెగా సిటీని రాజధానిగా జగన్ ప్రతిపాదించారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో 'మావిగన్ వర్సెస్ అమరావతి' అనే అంశాన్నే తమ ప్రధాన అజెండాగా మారుస్తామని, ప్రజలు ఏ రాజధానిని కోరుకుంటున్నారో ఎన్నికల్లోనే తేల్చుకుంటామని చంద్రబాబుకు జగన్ బహిరంగ సవాల్ విసిరారు. అమరావతి కంటే మావిగన్‌కే ప్రజల మద్దతు లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు స్ట్రాంగ్ కౌంటర్.. తిరుపతిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు, జగన్ విసిరిన సవాల్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ వైఖరిని ఎండగడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రోజుకో మాట - నిలకడలేని రాజకీయం: "ఆ గొడ్డలి పార్టీ నేతలతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వారికి ఓ విధానం లేదు, రోజుకో మాట మాట్లాడుతుంటారు. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు