
ఉన్నత భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన ఒక తెలుగు యువకుడు అక్కడ ప్రకృతి వైపరీత్యానికి గురై గల్లంతైన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఇటీవల ముంచెత్తిన అకాల భారీ వర్షాలు, వరదల ఉధృతికి ఆంధ్రప్రదేశ్‌కు లోని బాపట్ల జిల్లా పర్చూరు మండలం పరిధిలోని దేవరపల్లి గ్రామానికి చెందిన దొప్పలపూడి వెంకటేష్ (Doppalapudi Venkatesh) అనే యువకుడు కొట్టుకుపోయాడు. వెంకటేష్ ప్రస్తుతం అమెరికాలోని ఒమాహా నగరంలో నివసిస్తున్నాడు. అయితే ఇటీవల పొరుగు రాష్ట్రమైన కాన్సాస్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో భారీ వరదలు ముంచెత్తాయి. వెల్లింగ్టన్ ప్రాంత సమీపంలోని ఎస్. ఆలివర్ రోడ్ గుండా వెళ్తుండగా వెంకటేష్ ప్రయాణిస్తున్న వాహనం వరద ఉధృతికి చిక్కుకుంది. ప్రమాదవశాత్తూ ఆయన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. స్థానిక రెస్క్యూ టీమ్స్ జరిపిన గాలింపులో వెంకటేష్ ప్రయాణించిన కారు (Car), ఆయన బ్యాగు (bag) లభ్యమైనప్పటికీ, అతని మొబైల్ ఫోన్ గానీ, వ్యక్తిగత ఆచూకీ గానీ ఇప్పటివరకు లభించలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ కుటుంబంలో భయాందోళనలు తీవ్రమవుతున్నాయి. ఈ విషయం తెలుసిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు (Eluri Sambasiva Rao) కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu), పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌లకు లేఖ రాశారు. వెంటనే వెంకటేశ్ ఆచూకీ గుర్తించేలా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు