అమెరికా రాజీ పడటం
Actor ProfilePolitician

అమెరికా రాజీ పడటం

Total News1
Movie Updates0
Sources1
అమెరికా రాజీ పడటంపై నిప్పులు చెరిగిన ఇజ్రాయెల్
Oneindia Telugu15 Jun 2026
అమెరికా రాజీ పడటంపై నిప్పులు చెరిగిన ఇజ్రాయెల్

అమెరికా, ఇరాన్‌ల మధ్య అత్యంత కీలకమైన దౌత్య ఒప్పందం త్వరలో జరగబోతోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 19న శుక్రవారం నాడు ఈ చారిత్రక ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. దీనివల్ల వ్యూహాత్మకంగా ప్రపంచ రవాణా రంగానికి ఎంతో ప్రాధాన్యత కలిగిన హోర్ముజ్ జలసంధి రవాణా మార్గం వెంటనే తెరుచుకుంటుందని, దశాబ్దాల శత్రుత్వానికి ముగింపు పలుకుతూ నూతన దౌత్య సంబంధాలు ఊపందుకుంటాయని ట్రంప్ వివరించారు. దీనిపై ఇజ్రాయెల్ జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్ గ్విర్ ఘాటుగా స్పందించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంపై నిప్పులు చెరిగారు. ట్రంప్ ఒప్పందానికి తాము కట్టుబడి ఉండబోమని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ అమెరికా ఆధీనంలో లేదని, తమది స్వతంత్ర, సార్వభౌమ దేశమని గుర్తు చేశారు. ఇజ్రాయెల్ భద్రతను పణంగా పెట్టి అంతర్జాతీయ ఒత్తిడికి లోబడ్డ ప్రతిసారి, తాము వడ్డీతో కలిసి రక్తాన్ని చిందించాల్సి వచ్చిందని ఆయన ట్వీట్ చేశారు. సూపర్ పవర్ అమెరికా పట్ల తమకు ఎనలేని గౌరవం ఉన్నందని, ట్రంప్ అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతతో ఉంటామని బెన్ గ్విర్ అన్నారు. అయినప్పటికీ, తమది స్వయంప్రతిపత్తి కలిగిన దేశమని, బలహీనమైన 'బనానా రిపబ్లిక్' కాదనే విషయాన్ని అందరూ గ్రహించాలని హెచ్చరించారు. ఇజ్రాయెల్ భద్రతను ఎటువంటి హామీ ఇవ్వని ఈ శాంతి ఒప్పందంలో తాము భాగస్వాములు కాదని స్పష్టం చేశారు. తాము హెజ్బొల్లాను కూల్చివేయడం కంటే తక్కువ స్థాయికి రాజీపడబోమని ఆయన అన్నారు. గతంలో అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగిపోవడం వల్ల ఇజ్రాయెల్ ప్రయోజనాలు ఎలా దెబ్బతిన్నాయో బెన్ గ్విర్ వివరించారు. కొన్ని అనుభవాలను ఉదాహరించారు. భద్రతా విషయాలలో అంతర్జాతీయ శక్తుల ఒత్తిళ్లకు తలొగ్గి వెనక్కి తగ్గిన ప్రతిసారీ దేశ పౌరుల రక్తంతో భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చిందని, ఓస్లో ఒప్పందాలు, 2006 నాటి లెబనాన్ అగ్రిమెంట్, గాజా సరిహద్దుల్లో అనుసరించిన విధానాలు దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆయా సందర్భాల్లో తీసుకున్న