అమెరికాకు షాకిచ్చిన చైనా.. కీలక కంపెనీల
Actor ProfilePolitician

అమెరికాకు షాకిచ్చిన చైనా.. కీలక కంపెనీల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అమెరికాకు షాకిచ్చిన చైనా.. కీలక కంపెనీలపై ఆంక్షలు
Eenadu29 Jun 2026
అమెరికాకు షాకిచ్చిన చైనా.. కీలక కంపెనీలపై ఆంక్షలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాకు (USA) చెందిన 10 సైనిక సంబంధిత కంపెనీలపై చైనా (China) ఆంక్షలు విధించింది. ఆయా కంపెనీలకు పౌర-మిలిటరీ వినియోగ వస్తువుల ఎగుమతిని నిషేధిస్తున్నట్లు తెలిపింది. వీటిల్లో రేథియాన్‌, లాక్‌హీడ్‌ మార్టిన్‌ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. అగ్రరాజ్యం ఇటీవల తమ రక్షణ రంగ కాంట్రాక్టుల్లో చైనా టెక్ కంపెనీలను నిషేధించిన నేపథ్యంలో బీజింగ్ ఈ చర్యలు చేపట్టింది. దీంతో పాటు అమెరికాకు చెందిన 46 కంపెనీల నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేయకుండా తమ ప్రభుత్వ రంగ సంస్థలను నిరోధించనున్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతే కాకుండా ఇతర దేశాలు చైనా నుంచి కొనుగోలు చేసిన వస్తువులను.. ఆంక్షలకు గురైన అమెరికా కంపెనీలకు బదిలీ చేయడాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపింది. చైనా సైన్యంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ.. అలీబాబా, బైడూ సహా పలు టెక్ కంపెనీలపై ఈ నెల ఆరంభంలో అమెరికా రక్షణ శాఖ నిషేధం విధించింది. ఇకపై ఆయా కంపెనీలు అగ్రరాజ్య సైనిక కాంట్రాక్టులను పొందలేవని తెలిపింది. ఈ ఏడాది మే నెలలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ అయిన ట్రంప్‌.. ఇరు దేశాల మధ్య పరస్పర వాణిజ్య సహకారంపై అంగీకారానికి వచ్చారు. అయితే, నెల తిరక్కుండానే బీజింగ్ కంపెనీలపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించడం గమనార్హం. దీంతో బీజింగ్‌ కూడా ప్రతిచర్యలు చేపట్టింది. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు