అమెరికాకు ఇరాన్ వార్నింగ్!.. ఎందుకంటే
Actor ProfilePolitician

అమెరికాకు ఇరాన్ వార్నింగ్!.. ఎందుకంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అమెరికాకు ఇరాన్ వార్నింగ్!.. ఎందుకంటే
TeluguOne31 Aug 2026
అమెరికాకు ఇరాన్ వార్నింగ్!.. ఎందుకంటే

పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయంగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, అక్కడ ఉద్రిక్తతలు మాత్రం తగ్గడం లేదు సరికదా రోజు రోజుకూ పెచ్చరిల్లుతున్నాయి. తాజాగా ఇరాన్ అగ్రరాజ్యం అమెరికాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా అండతో రెచ్చిపోతున్న ఇజ్రాయెల్‌ను అదుపులో ఉంచాలనీ, లేకుండా తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. అమెరికా గనుక ఇజ్రాయెల్ దేశాన్ని నియంత్రించడంలో విఫలమైతే.. తామ స్పందన తీవ్రాతి తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్‌ను అమెరికా పెంచి పోషిస్తున్న పెంపుడు శక్తి గా ఇరాన్ అభివర్ణించడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. అసలింతకీ ఈ వివాదానికి కారణం ఏమిటంటే.. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఇరాన్ దేశ సుప్రీం లీడర్‌కు మరణశిక్ష విధించాలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చి సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. గతంలో ఈ ప్రాంతంలో ఘర్షణలను పూర్తిగా నివారించేందుకు ఇరు వర్గాల మధ్య కుదిరిన ముఖ్యమైన 14 పాయింట్ల అవగాహన ఒప్పందాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ ఒప్పందం మేరకు ఇజ్రాయెల్‌ను కంట్రోల్ లో ఉంచాల్సిన బాధ్యత అమెరికాదేనని కుండబద్దలు కొట్టారు. ఇజ్రాయెల్ గనుక తన మొండి వైఖరిని వీడకపోతే, ఆ దేశానికి యుద్ధ రంగంలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సోషల్ మీడియా ట్రోలర్స్‌కు డిప్యూటీ సీఎం పవన్ హెచ్చరిక చర్చలు జరపండి.. ఇండియా, పాక్ ప్రధానులకు ప్రముఖుల లేఖ!