మలయాళ సినీ పరిశ్రమలో సంచలనం చోటుచేసుకుంది. మాలీవుడ్ నటీనటుల సంఘం ‘అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్’ (AMMA) కార్యవర్గం మూకుమ్మడిగా రాజీనామా చేసింది. ఆర్థిక లావాదేవీలు, అంతర్గత విభేదాలు, స్పాన్సర్‌షిప్‌లకు సంబంధించిన వివాదాలు ముదరడంతో.. ‘అమ్మ’ అధ్యక్షురాలు, నటి శ్వేతా మీనన్ రాజీనామా చేశారు. ఆమెతో పాటుగా మిగతా కార్యవర్గ సభ్యులందరూ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.రాజీనామా చేసిన అనంతరం శ్వేతా మీనన్ మాట్లాడుతూ.. కొందరు కావాలనే తమ కమిటీని తొలగించే దురుద్దేశంతో, ఎజెండాను అమలు చేశారని అన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమందికి కమిటీ బాధ్యతలను అప్పగించే కుట్రలు జరుగుతున్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. తన పాలనలో ‘అమ్మ’ సంస్థ ఆర్థిక లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉన్నాయన్న శ్వేత.. గత కమిటీలోని బాబూరాజ్ పాలనలోనే కొన్ని ఆర్థిక, పరిపాలన సంబంధిత అవకతవకలు జరిగాయని ఆరోపించారు.* ‘ఓజీ 2 - ది డ్రాగన్ వారియర్’.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ 2025 ఆగస్టులో జరిగిన మలయాళ నటీనటుల సంఘం ఎన్నికల్లో శ్వేత మీనన్ అధ్యక్షురాలిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ కుక్కు పరమేశ్వరన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ‘అమ్మ’ చరిత్రలోనే తొలిసారిగా రెండు అత్యున్నత పదవులు చేపట్టిన మహిళలుగా నిలిచారు. అయితే ఏడాది కూడా పూర్తి కాకముందే పరిపాలన కమిటీ రాజీనామా చేసి వైదొలగడం మాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.ఇటీవల మాజీ జాయింట్ సెక్రటరీ అన్సిబా హసన్ కమిటీకి రాజీనామా చేయడంతో ‘అమ్మ’లో సంక్షోభం ముదిరింది. ఆ సమయంలో ఆమె కార్యవర్గంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కార్యవర్గంలోని కొందరు సభ్యులు తనను వేధిస్తున్నారని, మతపరమైన కోణంలో తనను టార్గెట్ చేస్తున్నారని అన్సిబా ఆరోపించారు. ‘అమ్మ’ కార్యక్రమాలకు మత సంస్థలను స్పాన్సర్లుగా తీసుకొచ్చారని, దాన్ని ప్రశ్నించినందుకు వేధిస్తున్నారని అన్నారు. ఉపాధ్యక్షురాలు లక్ష్మీ ప్రియ పనితీరులో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే శ్వేత మీనన్ అధ్యక్షతన ఏర్పాటైన కార్యవర్గం
Actor ProfilePolitician
అమ్మ’ రాజీనామా.. కుట్రలు చేస్తున్నారని నటి శ్వేతా మీనన్ ఆరోపణలు
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•26 Jun 2026
అమ్మ’ రాజీనామా.. కుట్రలు చేస్తున్నారని నటి శ్వేతా మీనన్ ఆరోపణలు