అమ్మానాన్నలు దూరమైనా.. అనుకున్నది సాధించింది
Actor ProfilePolitician

అమ్మానాన్నలు దూరమైనా.. అనుకున్నది సాధించింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అమ్మానాన్నలు దూరమైనా.. అనుకున్నది సాధించింది
Eenadu9 Jul 2026
అమ్మానాన్నలు దూరమైనా.. అనుకున్నది సాధించింది

ఈ రోజుల్లో అమ్మాయిలు లోకోపైలట్‌ కావడం సాధారణమైన విషయమే కావచ్చు.. కానీ జీవితం విసిరే కఠినమైన సవాళ్లను దాటుకొని ఈ కేంద్ర ప్రభుత్వోద్యోగం సంపాదించడమంటే కచ్చితంగా అది విశేషమనే చెప్పాలి. అలా తన విజయంతో ప్రస్తుతం వార్తల్లో నిలిచింది మధ్యప్రదేశ్‌కు చెందిన కల్పనా ప్రజాపతి. ఈ రోజుల్లో అమ్మాయిలు లోకోపైలట్‌ కావడం సాధారణమైన విషయమే కావచ్చు.. కానీ జీవితం విసిరే కఠినమైన సవాళ్లను దాటుకొని ఈ కేంద్ర ప్రభుత్వోద్యోగం సంపాదించడమంటే కచ్చితంగా అది విశేషమనే చెప్పాలి. అలా తన విజయంతో ప్రస్తుతం వార్తల్లో నిలిచింది మధ్యప్రదేశ్‌కు చెందిన కల్పనా ప్రజాపతి. పుట్టుకతోనే తల్లిని, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే క్రమంలో తండ్రిని కోల్పోయిన ఆమె.. కడు పేదరికాన్ని అనుభవించింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్నీ దాటుకొని లక్ష్యం వైపే అడుగేసింది. ఫలితంగా ఇటీవలే అసిస్టెంట్‌ లోకోపైలట్‌గా నియామక పత్రం అందుకున్న ఆమె.. తాజాగా తన తొలి ట్రయల్‌ రన్‌ పూర్తిచేసింది. ‘సాధించాలన్న సంకల్పం ఉంటే అసాధ్యమనేదే ఉండద’ని తన విజయంతో నిరూపించిన కల్పన స్ఫూర్తి కథ ఇది! మధ్యప్రదేశ్‌లోని రేవా పట్టణానికి ఆనుకొని ఉన్న చిన్న గ్రామంలో పుట్టి పెరిగింది కల్పన. ఆమె పుట్టిన కొన్ని గంటల్లోనే తల్లి చనిపోయింది. అప్పుడు తన బామ్మే ఆమెను అమ్మలా సాకింది.. ప్రేమగా పెంచి పెద్ద చేసింది. అయితే కడు పేదరికం మధ్య పెరిగినా తండ్రి ప్రోత్సాహంతో పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేసింది కల్పన. ఉన్నత చదువు, ప్రభుత్వోద్యోగంతోనే తమ జీవితాలకు మంచి రోజులొస్తాయని భావించిన ఆమె.. చదువులో మెరుగ్గా రాణించేది. ‘చిన్నప్పట్నుంచీ ప్రభుత్వోద్యోగమే లక్ష్యంగా పెట్టుకున్నా. ఈ క్రమంలోనే చదువు సాగించా. పలు పోటీ పరీక్షలూ రాశా. అయితే 2024లో ఐటీఐ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ పరీక్ష కోసం సన్నద్ధమవుతున్నా. సరిగ్గా పరీక్షకు రెండు రోజులుందనగా మా నాన్న విద్యుత్‌ షాక్‌తో చనిపోయారు. దాంతో నా జీవితం ఒక్కసారిగా తలకిందులైనట్లనిపించింది. ఇప్పటికే అమ్మ లేదు.. నాన్నను కూడా కోల్పోవడంతో నా దుఃఖం