అమెజాన్ ప్రైమ్ డే సేల్ హంగామా.. వన్ ప్లస్, రెడ్ మీ ఫోన్ల
Actor ProfileCelebrity

అమెజాన్ ప్రైమ్ డే సేల్ హంగామా.. వన్ ప్లస్, రెడ్ మీ ఫోన్ల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అమెజాన్ ప్రైమ్ డే సేల్ హంగామా.. వన్ ప్లస్, రెడ్ మీ ఫోన్లపై ఊహించని ఆఫర్లు
Asianet News Telugu6 Sept 2026
అమెజాన్ ప్రైమ్ డే సేల్ హంగామా.. వన్ ప్లస్, రెడ్ మీ ఫోన్లపై ఊహించని ఆఫర్లు

గ్యాడ్జెట్ లవర్స్‌కు అమెజాన్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. మోస్ట్ అవేటెడ్ అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. జూలై 4 నుంచి జూలై 6 వరకు మూడు రోజుల పాటు ఈ సేల్ ఈవెంట్ ఇండియాలో లైవ్ కానుంది. స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు, టీవీలు, కెమెరాలు, వైర్‌లెస్ స్పీకర్లు, ఇయర్‌ఫోన్లు, వేరబుల్స్, స్మార్ట్ హోమ్ అప్లయన్సెస్‌పై బెస్ట్ డీల్స్ సొంతం చేసుకోవడానికి ఇదొక సూపర్ ఛాన్స్. అయితే సేల్ శనివారం స్టార్ట్ అవుతున్నప్పటికీ.. గురువారమే అమెజాన్ అర్లీ డీల్స్ ను లైవ్ చేసింది. అంటే సేల్ కంటే ముందే టాప్ బ్రాండ్ల ఫోన్లను తక్కువ ధరకే కొనేయొచ్చు. వన్‌ప్లస్, రెడ్‌మీ, నథింగ్, లావా లాంటి పాపులర్ బ్రాండ్ల ఫోన్లపై క్రేజీ ఆఫర్లను కంపెనీ రివీల్ చేసింది. పాత ఫోన్ మార్చేసి కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ టైమ్. డైరెక్ట్ ప్రైస్ కట్స్‌తో పాటు అదనపు సేవింగ్స్ కోసం యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. జూలై 4 నుంచి అందరికీ సేల్ ఓపెన్ అవుతుంది కానీ, ప్రైమ్ మెంబర్లకు మాత్రం 24 గంటల ముందే ఈ డీల్స్ అందుబాటులోకి వస్తాయి. కింద పేర్కొన్న ధరల్లో బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు లేదా క్యాష్‌బ్యాక్‌లు కలపలేదు. అవి చెకౌట్ టైమ్‌లో అప్లై అవుతాయి. ప్రీమియం ఫోన్ సెగ్మెంట్‌లో వన్‌ప్లస్ లవర్స్‌కు పండగే అని చెప్పాలి. జనవరి 2025 లో ఇండియాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ 13 (OnePlus 13) పై అమెజాన్ ఏకంగా పెద్ద డిస్కౌంట్ ఇచ్చింది. రూ. 72,999 లిస్టెడ్ ప్రైస్ ఉన్న ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పుడు కేవలం రూ. 54,999 కే లభిస్తోంది. అలాగే వన్‌ప్లస్ 13ఎస్ (OnePlus 13s) మోడల్ అసలు ధర రూ. 57,999 కాగా, అర్లీ డీల్స్‌లో రూ. 49,999