అభిషేక్ నా కొడుకు లాంటివాడు.. కల్యాణ్ బెనర్జీ యూటర్న్
Actor ProfilePolitician

అభిషేక్ నా కొడుకు లాంటివాడు.. కల్యాణ్ బెనర్జీ యూటర్న్

Total News3
Movie Updates0
Sources1
భారీ వర్ష సూచన.. ' ' పరిధిలో హై అలర్ట్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra Jyothy13 Jun 2026
భారీ వర్ష సూచన.. ' ' పరిధిలో హై అలర్ట్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో CM రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో 'హై అలర్ట్' ప్రకటించాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని

మంచిర్యాలలో సింగరేణి కారుణ్య నియామకాలు.. 335 మందికి ఆర్డర్లు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి
Andhra Jyothy13 Jun 2026
మంచిర్యాలలో సింగరేణి కారుణ్య నియామకాలు.. 335 మందికి ఆర్డర్లు అందజేసిన డిప్యూటీ సీఎం భట్టి

మంచిర్యాలలో సింగరేణి డిపెండెంట్ కార్మికులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. 335 మంది డిపెండెంట్ కార్మికులకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నియామక పత్రాలను అందజేశారు. మంచిర్యాల, జూన్

అభిషేక్ నా కొడుకు లాంటివాడు.. కల్యాణ్ బెనర్జీ యూటర్న్
Andhra Jyothy13 Jun 2026
అభిషేక్ నా కొడుకు లాంటివాడు.. కల్యాణ్ బెనర్జీ యూటర్న్

టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఎవరికీ గౌరవం ఇవ్వడం లేదని, ఆయన కావాలో, తాను కావాలో తేల్చుకోండంటూ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అల్టిమేటం ఇచ్చిన ఆ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ శనివారంనాడు యూటర్న్ తీసుకున్నారు. అభిషేక్‌ను తన కొడుకుతో సమానమని అన్నారు. కోల్‌కతా: టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఎవరికీ గౌరవం ఇవ్వడం లేదని, ఆయన కావాలో, తాను కావాలో తేల్చుకోండంటూ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి అల్టిమేటం ఇచ్చిన ఆ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ శనివారంనాడు యూటర్న్ తీసుకున్నారు. 'అభిషేక్‌ నా కొడుకుతో సమానం. పిల్లలు ఏదైనా తప్పు చేస్తే క్షమించే గుణం తండ్రికి ఉంటుంది' అని అన్నారు. సంతకాల ఫోర్జరీ కోసులో అభిషేక్ తరఫున కల్యాణ్ బెనర్జీ వాదిస్తున్నారు. ఈ కేసులో అరెస్టు నుంచి అభిషేక్ బెనర్జీకి హైకోర్టు తాత్కాలిక రక్షణ ఇచ్చింది. అయితే ఈ కేసులో కల్యాణ్ బెనర్జీ స్థానంలో మరొక లాయర్ వచ్చి చేరడం ఆయన ఆగ్రహానికి కారణమైంది. అభిషేక్ అహంకారిగా మారిపోయాడని, ఎవరినీ గౌరవించడం లేదని, అభిషేక్ లేకుండా పార్టీ నడవదని మమతా బెనర్జీ భావిస్తే తాను పార్టీ నుంచి తప్పుకుంటానని ఆయన హెచ్చరించారు. దీనిపై అభిషేక్ ఆచితూచి స్పందించారు. కల్యాణ్ బెనర్జీ తనకంటే పెద్దవారని, ఆయన తన అభిప్రాయాలను చెప్పడంలో తప్పులేదని, చిన్నప్పటి నుంచి తనను ఆయన చూశారని, ఆయన గురించి తాను ఏమీ మాట్లాడలేనని అన్నారు. ఈ క్రమంలో అభిషేక్ తన కుమారుడి లాంటివాడని కల్యాణ్ బెనర్జీ ప్రకటించడంతో టీఎంసీ అధినాయకత్వం ఊపరి పీల్చుకుంది. కాగా, కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం కానుందంటూ కొందరు చేస్తున్న ఊహాగానాలను కల్యాణ్ బెనర్జీ శనివారంనాడు తోసిపుచ్చారు. కాంగ్రెస్‌లో టీఎంసీ కలవబోవడం లేదని చెప్పారు. రెబల్ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను కలుస్తారంటూ వస్తున్న వార్తలపై సూచిగా స్పందించారు. 'వాళ్లు ఏమి చేయాలనుకుంటే అది చేయవచ్చు. బీజేపీ గొడుకు కింద పనిచేయాలనుకుంటున్నారు. ఇదంతా ఓ