అభ్యర్థులకు గుడ్ న్యూస్.. జూన్ 21న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
Actor ProfilePolitician

అభ్యర్థులకు గుడ్ న్యూస్.. జూన్ 21న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అభ్యర్థులకు గుడ్ న్యూస్.. జూన్ 21న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
Zee Telugu18 Jun 2026
అభ్యర్థులకు గుడ్ న్యూస్.. జూన్ 21న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Tgsrtc Free Bus Travel Latest News: వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ కోసం నీట్ (NEET) పరీక్ష రాసే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అందించింది. జూన్ 21వ తేదీన జరగబోతున్న నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ టీజీఎస్ఆర్‌టీసీ (TGSRTC) బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. హాల్ టికెట్ చూపిస్తే చాలు.. ఫ్రీ జర్నీ.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు.. జూన్ 21న పరీక్ష రాయబోయే విద్యార్థులు తమ వెంట నీట్ హాల్ టికెట్ ఉంచుకుంటే సరిపోతుంది. బస్సు ఎక్కేటప్పుడు కండక్టర్‌కు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే.. పరీక్షా కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారిక ప్రకటనలో భాగంగా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లోని పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ఆర్థిక భారం తప్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. ఆర్టీసీ MDకి మంత్రి కీలక ఆదేశాలు.. ఈ ఉచిత ప్రయాణ నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆర్టీసీ ఎండీకి స్పష్టమైన ఆదేశాలు అధికారికంగా జారీ చేశారు. పరీక్ష రోజున విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉండే