
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Pawan Kalyan Health Update: భుజం కండరాల్లో తీవ్రమైన గాయంతో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం ఇంకా కుదుటపడలేదు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. కావాల్సిన వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు అత్యవసరంగా శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు. అయితే శస్త్రచికిత్స ఇప్పుడు వద్దని పవన్ కల్యాణ్ ససేమిరా అన్నారు. ఉప ముఖ్యమంత్రి, సినీనటుడు పవన్ కల్యాణ్‌కి ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో సోమవారం వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. రెండు భుజాలను నిశితంగా పరీక్షించిన వైద్యులు రొటేటర్ కఫ్‌తో పాటు భుజానికి సంబంధించిన రెండు కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు తమ పరీక్షల్లో నిర్ధారణ చేశారు. ఈ నొప్పిని తట్టుకోవడానికి తక్షణం శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు. ఇప్పటికిప్పుడు సర్జరీ చేసుకోవడానికి తాను సిద్ధంగా లేనని పవన్ కల్యాణ్ వైద్యులకు స్పష్టం చేశారు. తర్వాత శస్త్ర చికిత్స ముందుగా నిర్ణయించిన పాలనాపరమైన.. అధికారిక కార్యక్రమాలు పూర్తి చేయాలని, ఆ తర్వాతే శస్త్ర చికిత్స చేయించుకోవాలని పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పవన్ కల్యాణ్ కొంతకాలంగా భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ గాయం, రెండు భుజాలకి చెందిన కండరాలు పూర్తిగా చిట్లడంతో ఇబ్బందిపడుతున్నాడు. అంతకుముందు సైనస్‌తో బాధపడుతున్న పవన్ కల్యాణ్ గతంలో సర్జరీ చేసుకున్న విషయం తెలిసిందే. మరోసారి సర్జరీ చేసుకోవాల్సి ఉండడంతో ఆయన అభిమానులు, జనసేన పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. రీ-అపాయింట్‌మెంట్ పదవీ విరమణ పొందుతున్న డిప్యూటీ