
Read Also : Rental rules: అద్దెదారులకు శుభవార్త.. కేంద్రం కొత్త నిబంధనలు! చాలామంది జీవితాలు ఈఎంఐల కొరల్లో నలిగిపోతున్నా యి. నెలసరి వాయిదాలు చెల్లింపుల కోసం మధ్యతరగతి కుటుంబాలు తమ ప్రాథమిక అవసరాలను సైతం త్యాగం చేస్తున్నాయి. చిన్నచిన్న కోరికలను చంపుకుంటున్నాయి. విద్యతోనే బంగారు భవిష్యత్ ఉంటుందని భావించే క్రమం లో పిల్లలను నాణ్యమైన విద్యకు దూరం చేస్తున్నాయి. నెలవారీ వాయిదాల భయంతో పిల్లలను మంచి స్కూళ్లలో చదివించలేక సాధారణ పాఠశాలలకు మారుస్తున్న తల్లిదం డ్రులు ఎందరో. అటు అప్పులు తీర్చలేని క్రమంలోఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించాల్సిన దుస్థితి బడుగు జీవులది. చిన్నపాటి జబ్బులొస్తే ఆసుపత్రికి వెళ్లకుండా మెడికల్ షాపుల్లో మందులు, మాత్రలు తెచ్చుకుని సర్దుకుపోవాల్సిన సందర్భాలు అనేకం. ఇక పెద్ద వైద్యం ఖర్చు వస్తే అప్పుల పాలే గతి. సాధారణంగా మధ్యతరగతి వారి ఆదాయం పరిమితంగా ఉంటుంది. బ్యాంకులోను తీసుకుని ఇల్లు కొన్నప్పుడు, ఆ ఆదాయంలో సగానికి పైగా నెలసరి వాయిదాలకే సరిపోతుంది. ఏళ్లు గడుస్తున్నా జీతాలు పెరిగే వేగం కంటే ఖర్చులు పెరిగే వేగం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండటం వల్ల నెలాఖరు వచ్చేసరికి జేబులు ఖాళీ అవుతు న్నాయి. అనుకోని వైద్య ఖర్చులు రావడం, ఉద్యోగంలో ఒడిదుడుకులు ఎదురవడం, ఆర్థిక మాంద్యం వంటి పరిస్థి తులు సగటు పేద, మధ్యతరగతి జీవిని మరింత కృంగదీ స్తున్నాయి. ఇలాంటి చిన్నకుదుపు వచ్చినా సరే వారి ఆర్థిక ప్రణాళిక పేకమేడలా కూలిపోతోంది. నెలసరి వాయిదాలు సమయానికి చెల్లించలేక బ్యాంకుల నుంచి వచ్చే ఒత్తిళ్లు వారి ప్రశాంతతను పూర్తిగా దూరం చేస్తున్నాయి. వెంటా డుతున్న ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్న అప్పులు ఒకపక్క ఇంటి ఈఎంఐ కట్టడానికి, మరోపక్క ఆ నెల గడవడానికి మధ్యతరగతి ప్రజలు క్రెడిట్కార్డులు, వ్యక్తిగత రుణాలు, అధిక వడ్డీలకు బయట అప్పులు చేయడం ప్రారంభిస్తారు. ఇది ఒక ప్రమాదకరమైన విషవలయం లాంటిది. ఒకఅప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం. వడ్డీల