టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. ఈ ఏడాది సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన ఆయన.. వచ్చే సంవత్సరం పండక్కి తన తదుపరి చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా ఓ సినిమాని తాజాగా సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇలా మొదలైందో లేదో, అలా అనిల్ రావిపూడి పేరుతో కొందరు కేటుగాళ్లు సరికొత్త మోసానికి తెరలేపారు. తన అభిమాన హీరో వెంకటేష్, తనను డైరెక్టర్ గా పరిచయం చేసిన కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేశారు. దీనికి #VenkyAnil5 - #NKRAR2 అనే వర్కింగ్ టైటిల్స్ పెట్టారు. ఇందులో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మధ్యనే పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. అయితే ఈ సినిమాలో నటించే అరుదైన అవకాశం ఇప్పిస్తామంటూ కొంతమంది సోషల్ మీడియాలో ప్రకటనలు ఇవ్వడం మొదలు పెట్టారు. ఈ విషయం కాస్తా మేకర్స్ దృష్టికి చేరడంతో, దీనిపై వివరణ ఇచ్చారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదని, అది ఫేక్ కాస్టింగ్ కాల్ అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ లో ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ''మా సినిమా పేరుతో ఒక ఫేక్ కాస్టింగ్ కాల్ ప్రచారంలో ఉందనే విషయం మా దృష్టికి వచ్చింది. ఆ ప్రకటన పూర్తిగా అవాస్తవమని మేము స్పష్టం చేస్తున్నాము. దయచేసి ఇటువంటి మోసపూరిత చర్యలకు ఎవరూ నమ్మొద్దు. అలాగే మా సినిమా తరపున మాట్లాడుతున్నామని చెప్పుకునే వ్యక్తులకు ఎటువంటి వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, పత్రాలు లేదా డబ్బును ఇవ్వవద్దని మేము కోరుతున్నాము. మా సినిమాకు సంబంధించిన కాస్టింగ్ కాల్ ప్రకటనలు కేవలం మా అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మాత్రమే వెల్లడించబడతాయి. అందరూ అప్రమత్తంగా
Actor ProfileActor
అనిల్ రావిపూడి పేరుతో సరికొత్త మోసానికి తెరలేపిన కేటుగాళ్లు.. అలర్ట్ అయిన మేకర్స్
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•2 Jul 2026
అనిల్ రావిపూడి పేరుతో సరికొత్త మోసానికి తెరలేపిన కేటుగాళ్లు.. అలర్ట్ అయిన మేకర్స్