
సినీ ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి కోవలోకే వస్తుంది బ్యూటిఫుల్ కృతి శెట్టి సినీ ఇండస్ట్రీలో ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోయిన్లు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి కోవలోకే వస్తుంది బ్యూటిఫుల్ కృతి శెట్టి (Krithi Shetty). వైష్ణవ్ తేజ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఉప్పెన (Uppena) చిత్రంతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ మూవీతోనే బేబమ్మ బాక్సాఫీస్ వద్ద ఏకంగా వంద కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ సినిమాతో తన అందం, అద్భుతమైన అభినయంతో కుర్రకారు మనసులను కొల్లగొట్టింది. ఆ మొదటి సినిమా ఇచ్చిన ఊపుతో కృతి శెట్టి తన తదుపరి ప్రాజెక్టులను చాలా వేగంగా ఎంపిక చేసుకుని విజయాల బాట పట్టింది. నేచురల్ స్టార్ నాని సరసన నటించిన 'శ్యామ్ సింగరాయ్', అక్కినేని నాగచైతన్యతో కలిసి నటించిన 'బంగార్రాజు' చిత్రాలు వరుసగా ఘనవిజయాలు సాధించడంతో కృతి శెట్టి ఖాతాలో అనతికాలంలోనే హ్యాట్రిక్ హిట్లు చేరిపోయాయి. అయితే, ఈ హ్యాట్రిక్ విజయాల తర్వాత బేబమ్మ కెరీర్ ఒక్కసారిగా తీవ్ర ఒడిదొడుకులకు లోనైంది. ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ, మనమే వంటి వరుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాయి. 'ఉప్పెన' విడుదలై ఐదేళ్లు గడుస్తున్నా ఆ స్థాయి బ్లాక్‌బస్టర్ హిట్ మళ్లీ దక్కకపోవడంతో ఆమె కెరీర్ గ్రాఫ్ నెమ్మదించింది. దీంతో టాలీవుడ్‌లో ఒకప్పుడు గోల్డెన్ లెగ్ అనిపించుకున్న ఈ భామ కాస్తా ఐరన్ లెగ్‌గా మారిందంటూ ట్రోల్స్ కూడా మొదలయ్యాయి. సరిగ్గా ఇలాంటి క్లిష్ట సమయంలో కృతి శెట్టికి టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) రూపంలో