అనిరుధ్ తో కావ్య మారన్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా ? హింట్ ఇచ్చిన నటుడు
Actor ProfileActor

అనిరుధ్ తో కావ్య మారన్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా ? హింట్ ఇచ్చిన నటుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అనిరుధ్ తో కావ్య మారన్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా ? హింట్ ఇచ్చిన నటుడు
Asianet News Telugu9 Aug 2026
అనిరుధ్ తో కావ్య మారన్ పెళ్లి ఫిక్స్ అయ్యిందా ? హింట్ ఇచ్చిన నటుడు

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్, సన్ నెట్‌వర్క్ వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ప్రేమలో ఉన్నారని చాలాకాలంగా రూమర్స్ ఉన్నాయి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. కానీ, ఇద్దరిలో ఎవరూ దీన్ని ధృవీకరించలేదు. ఇప్పుడు నటుడు వై.జి. మహేంద్రన్ ఈ సీక్రెట్‌ను బయటపెట్టారు. ఇటీవల అనిరుధ్ బంధువు, నటుడు వై.జి. మహేంద్రన్ ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 'అనిరుధ్ చాలా మంచి అబ్బాయి, చిన్నప్పటి నుంచి తెలుసు. అతనికి పెళ్లి జరగబోతోందని నాక్కూడా తెలిసింది' అన్నారు. పేరు చెప్పకుండా, 'అనిరుధ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సాధారణ వ్యక్తి కాదు. ఆమె ఓ పెద్ద స్పోర్ట్స్ టీమ్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తోంది. కుటుంబ వ్యాపారంలో కీలక బాధ్యతల్లో ఉంది' అని చెప్పారు. ఇది కచ్చితంగా కావ్య మారన్‌ గురించేనని అందరూ భావిస్తున్నారు. సన్ టీవీ నెట్‌వర్క్ కీలక అధికారి అయిన కావ్య మారన్ పెళ్లి, ప్రేమ వ్యవహారంపై చాలాసార్లు వార్తలొచ్చాయి. కానీ, కావ్య మారన్ గానీ, అనిరుధ్ గానీ ఇప్పటివరకు స్పందించలేదు. ఇప్పుడు అనిరుధ్ బంధువే ఈ విషయం చెప్పడంతో అంచనాలు పెరిగాయి. ఈ ఏడాది ఐపీఎల్‌లో కావ్య మారన్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు చేరింది. కానీ, ప్లేఆఫ్స్‌లో ఓడిపోయింది. టోర్నీ మొత్తం టీమ్‌తో ఉండి, ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ కావ్య మారన్ జట్టును అద్భుతంగా నడిపించారు