అన్నను మించిన తమ్ముడు.. చితక్కొట్టిన వైభవ్ సోదరుడు ఆశీర్వాద్ సూర్యవంశీ
Actor ProfilePolitician

అన్నను మించిన తమ్ముడు.. చితక్కొట్టిన వైభవ్ సోదరుడు ఆశీర్వాద్ సూర్యవంశీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అన్నను మించిన తమ్ముడు.. చితక్కొట్టిన వైభవ్ సోదరుడు ఆశీర్వాద్ సూర్యవంశీ
Zee Telugu17 Jul 2026
అన్నను మించిన తమ్ముడు.. చితక్కొట్టిన వైభవ్ సోదరుడు ఆశీర్వాద్ సూర్యవంశీ

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. భారీ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగి ఆడుతూ ఐపీఎల్‌లో రికార్డులు బద్దలు కొడుతూ భారత సీనియర్‌ జట్టులోకి అతిచిన్న వయస్సులోనే అడుగుపెట్టిన వైభవ్‌ సూర్యవంశీని చూసి అతడి తమ్ముడు కూడా దుమ్మురేపుతున్నాడు. అన్న మాదిరి తమ్ముడు కూడా క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. అత్యంత వేగంగా పరుగులు తీస్తూ.. వైభవ్‌ సూర్యవంశీ సోదరుడు ఆశీర్వాద్‌ వైభవ్‌ సంచలన ప్రదర్శన చేశాడు. దేశీయ క్రికెట్‌ టోర్నీలో 119 బంతుల్లో 168 పరుగులు చేసి వెలుగులోకి వచ్చాడు. బాల క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీకి తమ్ముడు ఆశీర్వాద్‌ సూర్యవంశీ ఉన్నాడు. అన్న మాదిరి తమ్ముడు ఆశీర్వాద్‌ కూడా క్రికెట్‌లో రాణిస్తున్నాడు. తాజాగా బిహార్‌లో జరిగిన ఓ క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆశీర్వాద్‌ సూర్యవంశీ బరిలోకి దిగాడు. రిషవ్‌ 11 అనే జట్టు తరఫున గ్రౌండ్‌లోకి దిగిన ఆశీర్వాద్‌ 119 బంతుల్లో 168 పరుగులు చేసి తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 19 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉండడం విశేషం. ఆశీర్వాద్‌ బ్యాటింగ్‌తో అతడి జట్టు 40 ఓవర్‌లలో 7 వికెట్లు కోల్పోయి 311 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌కు ముందు జరిగిన మరో ఆటలో కూడా ఆశీర్వాద్‌ సెంచరీ నమోదు చేశాడు. బిరోలీ జట్టుపై ఆడిన ఆశీర్వాద్‌ 87 బంతుల్లో 103 పరుగులు చేశాడు. వాటిలో 20 ఫోర్లు, ఒక సిక్సర్ ఉండడం విశేషం. అన్న వైభవ్‌ ఎడమ చేతి వాటం కాగా.. తమ్ముడు ఆశీర్వాద్‌ కుడి చేతి వాటంతో క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. వైభవ్‌ మాదిరి ఆశీర్వాద్‌ను కూడా గొప్ప క్రికెటర్‌గా చేయాలని భావిస్తున్నట్లు వారి తండ్రి సంజీవ్‌ సూర్యవంశీ తెలిపాడు. తన తమ్ముడు చేసిన సెంచరీపై సోషల్‌ మీడియా