
అమరావతి: దేశానికి అన్నం పెడుతున్న అన్నదాతలకు సీఎం చంద్రబాబు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. భూమిని, పశుసంపదను పూజించి.. ప్రకృతితో అనుసంధానమయ్యే కార్యక్రమమిదని సీఎం అన్నారు. వ్యవసాయ రంగ బలోపేతానికి కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంటోందన్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తూ రైతన్నలు సాగుతో సిరులు పండించాలని కోరారు. అన్నదాతలకు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఏరువాక పున్నమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధం చాటి చెప్పేదే ఏరువాక పున్నమి అని పేర్కొన్నారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు