అన్నదాత సుఖీభవ నిధుల విడుదల
Actor ProfilePolitician

అన్నదాత సుఖీభవ నిధుల విడుదల

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources2
అన్నదాత సుఖీభవ నిధుల విడుదల
Andhra Jyothy20 Jun 2026
అన్నదాత సుఖీభవ నిధుల విడుదల

పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలోని లింగంగుట్లలో శనివారం విడుదల చేశారు. పీఎం కిసాన్‌-అన్నదాత సుఖీభవ కింద రూ.3,125 కోట్లు విడుదల చేశారు. పల్నాడు జిల్లా, జూన్ 20, (ఆంధ్రజ్యోతి): పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) పల్నాడు జిల్లాలోని లింగంగుట్లలో ఈరోజు(శనివారం) విడుదల చేశారు. పీఎం కిసాన్‌-అన్నదాత సుఖీభవ కింద రూ.3,125 కోట్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. పీఎం కిసాన్‌-అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.7 వేలు జమ చేశామని పేర్కొన్నారు. బటన్ నొక్కగానే 99.8 శాతం రైతులకు నిధులు జమయ్యాయని తెలిపారు. రైతులకు ఏటా రూ.20 వేలు ఇస్తామన్న హామీ నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు. జగన్ హయాంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారు.. జగన్ హయాంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. విధ్వంసం నుంచి ఏపీని వికాసం వైపు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. సంపద సృష్టిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చామని వివరించారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని తెలిపారు. మనం ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగుండాలని ఆకాంక్షించారు. వైసీపీ హయాంలో రైతులకు అన్నీ కష్టాలే అని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉందని వ్యాఖ్యానించారు. గతంలో ధాన్యం కొనుగోలు చేసిన.. 6 నెలలకు కూడా డబ్బులు వచ్చేవి కాదని అన్నారు. ఇప్పుడు 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని వివరించారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ ద్వారా రైతుల అవసరాలను గుర్తిస్తున్నామని చెప్పుకొచ్చారు. అన్నదాతలు యూరియా వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. మళ్లీ ప్రకృతి సేద్యం వైపు ప్రపంచం చూస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. రైతులకు లాభసాటిగా ఉండాలని పామాయిల్‌ పంటను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. పామాయిల్‌ పంటలో అంతర్గత పంటలూ వేసుకోవచ్చని చెప్పారు. మనం ప్రకృతి సేద్యం వైపు

పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయ్
Oneindia Telugu20 Jun 2026
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయ్

రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదలయ్యాయి. పల్నాడు

అన్నదాత సుఖీభవ నిధుల విడుదల వేళ కీలక నిర్ణయం, ఈ సారి వీరికే
Oneindia Telugu19 Jun 2026
అన్నదాత సుఖీభవ నిధుల విడుదల వేళ కీలక నిర్ణయం, ఈ సారి వీరికే

PM Kisan- అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు రంగం సిద్దమైంది. కేంద్రం విడుదల చేసే సమయంలోనే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఈ ఆర్దిక సంవత్సరం తొలి విడత నిధులను విడుదల చేసేందుకు నిర్ణయించింది. దీంతో.. కేంద్రం

అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం ఖరారు, ఒకే సారి రూ 6 వేలు
Oneindia Telugu17 Jun 2026
అన్నదాత సుఖీభవ నిధుల జమ ముహూర్తం ఖరారు, ఒకే సారి రూ 6 వేలు

రైతులకు కబురు. పీఎం కిసాన్ తో పాటుగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ నిధులు జమ అవుతున్నాయి. ఇప్పుడు మరో విడత పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధుల విడుదల పైన కీలక సమాచారం అందుతోంది