
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్ట్ ను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తా పులివెందుల ఎమ్మెల్యే ఏపీలో నివసిస్తే రెండేళ్లలో ఏం చేశామో తెలుస్తుంది ఎవరి ఓట్లు తీయాల్సిన అవసరం మాకు లేదు గొడ్డలి బ్యాచ్ కు మహిళలను గౌరవించడం తెలియదు జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీని ఆపలేరు డీఎస్సీపై ఎప్పుడైనా చర్చకు సిద్ధం మంగళగిరిలో విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ తాడేపల్లి: అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని నెం.1గా తీర్చిదిద్దుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. 2019లో 5,300 ఓట్ల తేడాతో మంగళగిరిలో నేను ఓడిపోయాను. మొదటి రోజు బాధ, ఆవేదన కలిగింది. రెండో రోజు ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ఊరూరా తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నా. 2024 ఎన్నికల్లో 53వేల ఓట్ల మెజార్టీతో గెలిపిస్తే కొండంత బలం వస్తుందని చెప్పాను. నా కోరికను మన్నించి రాష్ట్రంలోనే మూడో అత్యధిక మెజార్టీతో గెలిపించారు. నాపై ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. గెలిచిన మొదటిరోజు నుంచే మంగళగిరి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాం. తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ పవర్ మొత్తం మంగళగిరి నియోజకవర్గానికి ఏర్పాటుచేస్తున్నాం. దుగ్గిరాలలో అన్న క్యాంటీన్ ప్రారంభించాం. లైబ్రరీలకు పూర్వవైభవం తీసుకువస్తున్నాం. మంగళగిరి పట్టణంలో వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నాం. పార్క్ లు, లేక్ లు, కమ్యూనిటీ భవనాలు, చివరకు శ్మశానాలను కూడా అభివృద్ధి చేస్తున్నాం. అన్ని రంగాల్లో మంగళగిరి నియోజకవర్గాన్ని నెం.1గా తీర్చిదిద్దుతాం రెండేళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. మంగళగిరికి భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను తీసుకువచ్చాం. ఎంపీ పెమ్మసాని గారు కేంద్రంతో మాట్లాడి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద మంగళగిరికి మంజూరు చేయించారు. ఇది మంగళగిరి ప్రజల అదృష్టం. మంగళగిరి నియోజకవర్గ వాసిగా ఈ ప్రాజెక్ట్ ను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తా