
సాక్షి,చెన్నై: తమిళనాడు తిరువల్లూర్ జిల్లా గుమ్మిడిపూండి అనే స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ అఫ్ తమిళనాడు (SIPCOT) ఇండస్ట్రియల్ ఎస్టేట్ ప్రాంతంలో మూడేళ్ల బాలికపై లైంగిక దాడి, ఆపై చిన్నారి మరణం రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహావేశాలు రేకెత్తుతున్నాయి. ఈ ఘటనపై మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే.అన్నామలై చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. జూన్ 14న బిహార్ రాష్ట్రం బిబిన్ మంజికి చెందిన అభియోగి అనే 19ఏళ్ల వలస కార్మికుడు చిన్నారికి బిస్కెట్లు కొనిస్తానని చెప్పి తీసుకెళ్లాడు. ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉన్న పొదల్లో లైంగిక దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో తాళలేక గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారిని స్థానికులు, కుటుంబసభ్యులు గమనించి అత్యవసర చికిత్స నిమిత్తం గుమ్మిడిపూండి ప్రభుత్వ ఆసుపత్రికి, తరువాత చెన్నై స్టాన్లీ ఆసుపత్రికి తరలించారు. జూన్ 15 ఉదయం బాలిక తీవ్ర గాయాలతో మరణించింది. దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దారుణానికి ఒడిగట్టిన అభియోగిని దేహశుద్ధి చేసిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. విజయ్ ప్రభుత్వానికి డిమాండ్ ఆ ఘటనపై స్పందించిన అన్నామలై.. పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవడం ప్రశంసించారు. అయినప్పటికీ, ఇలాంటి నేరాలను ముందుగానే నివారించడంపై దృష్టి పెట్టాలి అని అన్నారు. ఉద్యోగాల కోసం వలస రావడం సహజమని పేర్కొంటూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుండి వచ్చే కార్మికుల రికార్డులు సరైన విధంగా నిర్వహిస్తుందా, యజమానులు, కాంట్రాక్టర్లు వారి వివరాలను అధికారులకు అందిస్తున్నారా అని ప్రశ్నించారు. వలస కార్మికుల వివరాలు, వారి స్వస్థలం, పని చేసే ప్రదేశం, నివాసం, రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది పనిచేస్తున్నారు వంటి సమాచారం సేకరించి, ట్రాక్ చేసి, పర్యవేక్షించే విధంగా తమిళనాడు ప్రభుత్వం వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వాళ్లవల్లే దారుణాలు అందుకు ఇటీవల రాష్ట్రంలో జరిగిన దుర్ఘటనలను ఎక్స్ వేదికగా ఉదహరించారు. ‘ జూన్ నెల ప్రారంభంలో