
Annamalai : తమిళనాడులో సినిమా హీరో విజయ్ ముఖ్యమంత్రిగా ఎన్ని కల్లో గెల్చి ఒక చరిత్రనే సృష్టిం చాడు. ఎన్నో ఏళ్ళ అనుభవంతో పాతుకొని పోయిన పార్టీలు డి. యం. కె. ఏఐడియంకె, వాటితోపాటు నామ మాత్రంగా మిగిలివున్న కాంగ్రెస్పార్టీ, ఏదో విధంగా తమిళనాడును వశ పర్చుకోవాలని వ్యూహంతో కొన్నేళ్ల నుంచి కాపేసివున్న బి.జె.పి. అన్నీ విజయ్ గెలుపు ముందు తలవొంచక తప్పలేదు. అయితే సంపూర్ణ విజయానికి అడుగు దూరం లో వున్న విజయ్ పార్టీకి సీట్లు తక్కువయినప్పుడు వ్యూహం రచించి సరిపడా చిన్నాచితకా పార్టీలను దగ్గరకు చేర్చి సి.యం కుర్చీని విజయ్కు వచ్చేట్లు చేయటం జరిగింది. బెల్లం చుట్టూ చీమలు చేరినట్లు అధికారం వున్న విజయ్ చుట్టూ ఎ.ఐ.ఎ.డి.యంకె పార్టీలోని కొందరు ఎం.ఎల్.ఏ లు విజయ్ టి.వి.కె. పార్టీలోకి క్యూ కటున్నా, అతను ప్రలోభాలు పెట్టకుండా ఎక్కువ ఓటర్లను వశపర్చుకున్నా, ఎన్ని కలు ముందు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు స్త్రీలకు, విద్యా ర్థులకు, యువతకు, వృద్ధులకు సమకూరుస్తానని మాట యిచ్చారు! నిజానికి యితర పార్టీలు అన్ని రాష్ట్రాలలో ఎడా పెడా యిస్తున్న హామీల్లాంటివే! అవి ఏవిధంగా నెరవేర్చ గులుగుతాడని, ఆర్థిక నిపుణులు అప్పుడే పెదవి విరవటం మొదలు పెట్టారు! ప్రీ బీస్ గా రాజకీయ రంగంలో ప్రసిద్ధి గాంచిన ఈ ఉచితాలు ఇవ్వటం సాధ్యమా అన్నది కొత్తగా ఎన్నికయిన విజయ్ కూడా ఆలోచించినట్లు లేదు! ఇప్పుడు ప్రభుత్వ ఖజానాలో తగిన డబ్బులేదు. నిజానికి దాదాపు ఏమీ లేదు అన్న ధోరణిలో మాట్లాడుతున్న ఆ పార్టీ నాయ కులే కాదు అతని శ్రేయోభిలాషులు కూడా తలలు పట్టుకొని కూర్చున్నారు. డి.ఎం.కే. నాయకుడు స్టాలిన్ ఆరు నెలల దాకా విమర్శలు కొత్త ప్రభుత్వం మీద చేయనన్నాడు గానీ, మిగతా పార్టీలు కొన్ని తలోరాయి విసురుతుంటే, నియం త్రించుకోలేక, స్టాలిన్ కూడా ఆరు నెలల మాట మరిచిపోయి విమర్శలు ఘాటుగానే కొత్త ప్రభుత్వం మీద మొదలుపెట్టాడు. Read