
విరాట్ కర్ణ హీరోగా, నభా నటేశ్ , ఐశ్వర్య మేనన్ హీరోయిన్లుగా తెరకెక్కుతున్న అద్భుత చిత్రం ‘నాగబంధం’. కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడిక్ నేపథ్యంతో, అనంత పద్మనాభస్వామి ఆలయం అక్కడి నాగబంధం రహస్యాల కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించిన ఫిక్షనల్ కథతో ఈ చిత్రాన్ని విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్నారు.తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, శతాబ్దాల నాటి చరిత్ర, పురాణాల నేపథ్యంతో రూపొందిన ఈ మైండ్ బ్లోయింగ్ మిస్టరీ అడ్వెంచర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు త్వరలో రానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ లో సినిమా ఏంటో అందరికి అర్ధం అయింది. మూవీపై ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోయింది. ట్రైలర్ మొదటి ఫ్రేమ్ నుంచే ప్రేక్షకులను ఒక సరికొత్త ఆధ్యాత్మిక, సాహసోపేత ప్రపంచంలోకి తీసుకెళ్లేలా రూపొందింది. విడుదలైన వెంటనే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. సాధారణ మైథలాజికల్ చిత్రాలకు భిన్నంగా కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిన నాగబంధం సినిమా జులై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ‘నాగబంధం’ కథ కేరళలో ఉన్నటువంటి ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన అనంత పద్మనాభస్వామి దేవాలయం చుట్టూ తిరుగుతుంది. అపారమైన శక్తులు, అమూల్యమైనసంపద కలిగిన దైవిక శక్తులు ఉన్న రహస్య ‘బ్రహ్మ కమలం’ చుట్టూ ఈ కథ ముడిపడి ఉంటుంది. పురాతన కాలం నాటి రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న సమయంలో, ఆ దైవిక నిధిని బ్రహ్మ కమలాన్ని దక్కించుకోవడానికి ఒక దుష్టశక్తి సమాజంపై దాడికి దిగుతుంది. ఆ రాక్షస శక్తుల నుంచి దేవుడి నిధిని కాపాడేందుకు భగవంతుడి ఆజ్ఞతో నాగసాధువులు రంగంలోకి దిగుతారు. ఈ పోరాటం ఏమౌతుంది, అసలు నాగబంధం రహస్యం ఏమిటి? ఆ దైవిక సంపదను దుష్టుల చేతికి చిక్కకుండా ఎలా రక్షించారు? అనేదే సినిమా అసలు లైన్. దర్శకుడు అభిషేక్