అధ్యాపక నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి
Actor ProfilePolitician

అధ్యాపక నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అధ్యాపక నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి
Telugu Times25 Jul 2026
అధ్యాపక నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి

ఇప్పటివరకు వివిధ యూనివర్సిటీలకు 1.89 లక్షల దరఖాస్తుల రాక రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకై విధివిధానాల రూపకల్పన జాబ్ మేళాల ద్వారా ఇప్పటివరకు 1.30లక్షలమందికి ఉద్యోగాలు పీఎం సేతు పథకం కింద రాష్ట్రానికి 5 క్లస్టర్లు మంజూరు చేసిన కేంద్రం ఉన్నత విద్య, స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష అమరావతి: రాష్ట్రంలో వివిధ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసెర్ల రిక్రూట్ మెంట్ ను మరింత పారదర్శకత, నాణ్యత, స్థిరత్వంతో అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో ఉన్నత విద్య, స్కిల్ డెవలప్ మెంట్ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... వివిధ యూనివర్సిటీల్లో 1523 అధ్యాపక పోస్టులకు ప్రకటించిన ఫ్యాకల్టీ రిక్రూట్ నోటిఫికేషన్ విడుదల తర్వాత వచ్చిన దరఖాస్తులపై అధికారులను వాకబు చేశారు. అధికారులు సమాధానమిస్తూ ఇప్పటివరకు 1,89,316 అఫ్లికేషన్లు వచ్చాయని చెప్పారు. ప్రతిదరఖాస్తును డేటా డ్రివెన్ క్రాస్ వెరిఫికేషన్ చేయాల్సిందిగా మంత్రి సూచించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రాతపరీక్షకు సంబంధించి ఇప్పటికే సిలబస్ ఇచ్చామని చెప్పారు. యూనివర్సిటీ యూనిట్ గా రిక్రూట్ మెంట్ చేపడుతున్నందున... సెలక్షన్ కమిటీలకు ఎంపిక ప్రక్రియపై స్పష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వాలి, వీలైనంత త్వరగా యూనివర్సిటీ అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిచేయాలని అన్నారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు సంబంధించి విధివిధానాల రూపకల్పనపై మంత్రి సమీక్షిస్తూ ఇండస్ట్రీ లింకేజి, సెక్టార్ టై అప్ నిబంధన ఖచ్చితంగా ఉండాలని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని స్కిల్ యూనివర్సిటీల స్థాపనకు దేశంలోనే ఒక నమూనాగా ఈ చట్టం ఉండాలని అధికారులకు సూచించారు. వచ్చే నెలలో నైపుణ్యం పోర్టల్ ఆవిష్కరణ స్కిల్ డెవలప్ మెంట్ పై మంత్రి లోకేష్ సమీక్షిస్తూ... నిరుద్యోగ యువతకు ఉపయోగకరంగా తయారుచేసిన నైపుణ్యం పోర్టల్ ను జులైలో ఆవిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని